COVID-19 third wave in India? China, Russia, UK, Singapore record resurgence in cases: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా (Corona) కల్లోలం మళ్లీ మొదలైంది. యూకే, చైనా, రష్యా, అమెరికా, సింగపూర్,(Singapore) ఐరోపాలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. తూర్పు ఐరోపా దేశాల్లో కోవిడ్ కేసులు (Covid cases) ఎక్కువగా ఉన్నాయి. యూకే తదితర చోట్ల కేసుల పెరుగుదలకు కోవిడ్ తాజా వైరస్ వేరియెంట్ మ్యుటేషన్ ఏవై. 4.2 ( AY.4.2 ) కారణమని స్పష్టమైంది.రష్యా, (Russia) యూకే, సింగపూర్, చైనాల్లో భారీగా కొత్త వేరియెంట్ కేసులు నమోదు అవుతున్నాయి. భారీ స్థాయిలో నమోదు కోవిడ్ కేసులు నమోదు కావడం అందరినీ కలవరపెడుతోంది. రష్యాలో రోజుకు 40వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. యూకేలో 50వేలకు పైగా ఏవై. 4.2 కేసులు నమోదు అవుతున్నాయి.
అయితే ఈ రకం మ్యుటేషన్ మనదేశంలో కాస్త తక్కువే అని చెప్పాలి. తెలంగాణతో (Telangana) పాటు మహారాష్ట్ర, కర్ణాటక, (Karnataka) తమిళనాడు, జమ్మూ కశ్మీర్‌లో మొత్తం 18 కేసులు ఇలాంటివి గుర్తించారు. అయితే దీని వ్యాప్తి, తీవ్రత ఎక్కువగా లేదు. కానీ కోవిడ్ వేరియెంట్ మ్యుటేషన్ ఏవై. 4.2 కేసులు నెమ్మదిగా మనదేశంలో కూడా పెరుగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో మనదేశంలో కూడా కోవిడ్ థర్డ్ వేవ్ (Third wave) వచ్చే అవకాశం ఉందా అనే అనుమానం కలుగుతోంది.
Also Read : New rules form November 1: నవంబర్ 1 నుంచి భారీ మార్పులు- ఇప్పుడే ఈ విషయాలు తెలుసుకో
దీంతో కేంద్రం నవంబర్ 30 దాకా జాతీయ స్థాయిలో కోవిడ్ కంటైన్మెంట్ (Containment) చర్యలను పొడిగిస్తూ రాష్ట్రాలకు ఉత్తర్వులు జారీ చేసింది. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, జమ్మూ కశ్మీర్, తెలంగాణలో ఈ కేసులు నమోదయ్యాయి.
యూకే, తదితర దేశాల్లో ఈ రకం స్ట్రెయిన్ (Strain) ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది. ఆ దేశాల్లో టీకా కార్యక్రమం విషయంలో ప్రాంతీయ అసమానతలు ఎక్కువగా ఉండటంతో ఒకే రకమైన వ్యాక్సినేషన్ జరగకపోవడం ఇందుకు కారణం అని శాస్త్రవేత్తలు అంటున్నారు. కానీ మనదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఒకే రకమైన టీకాలు వేయడం వల్ల మన దగ్గర కొత్త స్ట్రెయిన్ ఎక్కువ వ్యాప్తి చెందలేదని తెలుస్తోంది. కోవిడ్ (COVID) కూడా అదుపులో ఉంది.
Also Read : India Vs New Zealand: భారత్‌ను కలవరపెడుతున్న ఆ ఇద్దరు న్యూజిలాండ్ బౌలర్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి