Bombay High Court bars Invesco from calling EGM: జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ఇన్వెస్కోపై చేస్తున్న న్యాయపోరాటంలో పై చేయి సాధించింది. జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్‌లో మేజర్ షేర్‌హోల్డర్ అయిన ఇన్వెస్కో సంస్థ అత్యవసర సర్వసభ్య సమావేశం నిర్వహించడానికి వీలు లేకుండా తాత్కాలికంగా బాంబే హై కోర్టు జీల్ సంస్థకు అనుకూలంగా ఇంజక్షన్ ఆర్డర్స్ జారీచేసింది. బాంబే హై కోర్టు మంగళవారం తీసుకున్న ఈ నిర్ణయం జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్‌కి భారీ ఊరటనిచ్చింది. చట్టవిరుద్ధంగా అత్యవసర సర్వసభ్య సమావేశం (Invesco EGM) నిర్వహించి జీల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌తో పాటు మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ అయిన పునీత్ గోయెంకాను మార్చేయాలని కుట్ర పన్నిన ఇన్వెస్కోకు బాంబే హై కోర్టు ఆదేశాలు ఇచ్చిన తీరు మింగుడుపడని పరిణామంగా మారింది.
తమ సంస్థకి చెందిన మీడియా కంపెనీలను జీలో విలీనం చేసేందుకు తాము ప్రతిపాదన చేసిన మాట వాస్తవామేనని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇటీవల ఓ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మీడియా కంపెనీలు జీల్ కలిసి ఏర్పడే కొత్త విలీనం కంపెనీకి కూడా జీల్ ఎండీ, సీఈఓగా ఉన్న పునీత్ గోయెంకాను కొనసాగించాలని తమ ప్రతిపాదనలో పేర్కొన్నట్టు రిలయన్స్ (Reliance industries limited) తమ ప్రకటన ద్వారా స్పష్టంచేసింది. ఆ తర్వాత కొద్ది గంటలకే జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ఎండీ, సీఈఓ పునీత్ గోయెంకా సైతం ఓ ప్రకటన విడుదల చేస్తూ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రతిపాదనలో ఇన్వెస్కో సంస్థ కుట్రపూరితంగా పోషించిన కీలక పాత్రను తేటతెల్లం చేశారు.
ఈ వివాదంపై పునీత్ గోయెంకా ( ZEEL MD & CEO Mr. Punit Goenka) స్పందిస్తూ.. చర్చలకు సంబంధించిన ప్రతీ అంశంలో తాము మొదటి నుంచి పూర్తి పారదర్శకతతో వ్యవహరిస్తూ వస్తున్నామని తెలిపారు. ఈ విషయంలో ఇక ఇదే తాను ఇచ్చే మొదటి, చివరి సమాచారం అవుతుందని ఆశిస్తున్నానని పేర్కొన్న పునీత్ గోయెంకా.. ఇకపై జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ అభివృద్ధిపైనే దృష్టి సారించనున్నట్టు వెల్లడించారు.
Also read : ZEEL-Invesco case: జీ ఎంటర్టైన్మెంట్ డీల్ విషయంలో Invesco మోసాన్ని బట్టబయలు చేసిన Punit Goenka
"ఇన్వెస్కో కంపెనీ నుంచి గతంలో చాలా మద్దతు లభించిందని.. కానీ ప్రస్తుతం ఆ సంబంధం దెబ్బతినడం, ఇలాంటి దురదృష్టకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి రావడం చాలా ఆవేదనకు గురిచేస్తోంది'' అని పునీత్ గోయెంక (Mr. Punit Goenka about INVESCO) ఆందోళన వ్యక్తంచేశారు.
ZEEL-Invesco matter - జీల్-ఇన్వెస్కో విషయం:
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కి చెందిన మీడియా సంస్థలు జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్‌తో కలిసి విలీనం చేసేందుకు అంగీకరించాల్సిందిగా ఇన్వెస్కో జీల్‌పై తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చింది. అయితే, జీలో విలీనం చేయబోయే మీడియా సంస్థల విలువను సుమారు రూ. 10,000 కోట్లు పెంచి చూపించడం ఇష్టం లేకపోవడంతో ఇన్వెస్కో చేసిన ప్రతిపాదనకు జీ ఎంటర్టైన్మెంట్ సున్నితంగానే నో (Zee refused deal with RIL) చెప్పింది.
జీల్-ఇన్వెస్కో మధ్య అలా మొదలైన యుద్ధం తారా స్థాయికి చేరింది. ఎలాగైనా జీల్ ఎండీ, సీఈఓ పునీత్ గోయెంకపై విజయం సాధించాలని భావించిన ఇన్వెస్కో తనకు లేనటువంటి అధికారాలను కూడా ఉపయోగించి జీల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌ని మార్చేందుకు నడుం బిగించింది. అందుకు జీల్ బోర్డ్ నో చెప్పడంతో అత్యవసర సర్వసభ్య సమావేశం (Invesco's EGM) నిర్వహించి డైరెక్టర్స్ అశోక్ కురియెన్, మనీష్ చొకానిలను బయటికి పంపించేందుకు కుట్ర పన్నింది. కానీ ఆ ఇద్దరూ బోర్డుకు రాజీనామా చేయడంతో ఇన్వెస్కో చేసిన ప్రతిపాదన సైతం ఉత్తిదే అయింది.
Also read : ZEEL-Invesco case: ZEEL merger ప్రతిపాదనపై స్పందించిన Reliance.. కీలకమైన అంశాలు వెల్లడి
అంతటితో సరిపెట్టుకోని ఇన్వెస్కో.. జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌ని మార్చేసి వారి స్థానంలో కొత్తగా సురేంద్ర సింగ్ సిరోహి, నైనా కృష్ణ మూర్తి, రోహన్ ధమిజ, అరుణ శర్మ, శ్రీనివాస రావు అడ్డేపల్లి, గౌరవ్ మెహతాలను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌గా నియమించేందుకు విశ్వ ప్రయత్నాలు చేసింది. ఇన్వెస్కో చేసిన చేసిన అన్ని కుట్రలను అడ్డుకుంటూ వచ్చిన జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (Zee Entertainment Enterprises Limited - ZEEL).. చివరకు అత్యవసర సర్వసభ్య సమావేశం నిర్వహించాలన్న ఇన్వెస్కో కుట్రను సైతం తన న్యాయపోరాటంతో తిప్పికొట్టడం విశేషం.
Also read : ZEEL, Sony merger deal: జీ ఎంటర్టైన్మెంట్, సోనీ పిక్చర్స్ విలీనం.. ఎవరి బలాలు ఎంత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook