Mothkupalli Narsimhulu: టీఆర్ఎస్‌లో మోత్కుపల్లి చేరికకు తేదీ, ముహూర్తం ఖరారు

Mothkupalli Narsimhulu to join TRS: సీఎం కేసీఆర్‌ టీడీపీలో ఉన్నప్పటి నుంచే మోత్కుపల్లి నర్సింహులుకు (Mothkupalli Narsimhulu) ఆయనతో మంచి సాన్నిహిత్యం ఉంది. ఆ చనువే సీఎం కేసీఆర్, మోత్కుపల్లి నర్సింహులు ఇద్దరూ మళ్లీ ఒక్కతాటిపైకి రావడానికి దోహదపడింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 16, 2021, 05:25 PM IST
  • మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సర్వం సిద్ధం
  • అందుకు తేదీ, ముహూర్తం ఖరారైనట్టు సమాచారం.
  • హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలోనే...
Mothkupalli Narsimhulu: టీఆర్ఎస్‌లో మోత్కుపల్లి చేరికకు తేదీ, ముహూర్తం ఖరారు

Mothkupalli Narsimhulu to join TRS: హైదరాబాద్: మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారనే వార్తలు ఇవాళ కొత్తవి కాదు. త్వరలోనే మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారంటూ ఆయన బీజేపికి గుడ్‌బై చెప్పిన రోజు నుంచే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే, తాజాగా మోత్కుపల్లి నర్సింహులు చేరికకు సర్వం సిద్ధమైనట్టు తెలుస్తోంది. అందుకు తేదీ, ముహూర్తం ఖరారైనట్టు సమాచారం. 

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం ఈ నెల 18న.. అంటే సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు మోత్కుపల్లి టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. తెలంగాణ భవన్‌లో తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, సీఎం కేసీఆర్ స్వయంగా మోత్కుపల్లి నర్సింహులును టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోనున్నారు. పార్టీలో చేరిన వెంటనే మోత్కుపల్లి నర్సింహులును దళిత బంధు కమిటీ (Dalita Bandhu committee chairman) చైర్మన్‌గా నియమించే అవకాశాలు మెండుగా ఉన్నాయని పార్టీ వర్గాల్లో ముందునుంచే జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదే అంశంపై ఇప్పటికే మీడియాలోనూ అనేక వార్తలు వెలువడ్డాయి. 

Also read : Hyderabad Rain : హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం.. Yellow alert జారీ

సీఎం కేసీఆర్‌ టీడీపీలో ఉన్నప్పటి నుంచే మోత్కుపల్లి నర్సింహులుకు (Mothkupalli Narsimhulu) ఆయనతో మంచి సాన్నిహిత్యం ఉంది. ఆ చనువే సీఎం కేసీఆర్, మోత్కుపల్లి నర్సింహులు ఇద్దరూ మళ్లీ ఒక్కతాటిపైకి రావడానికి దోహదపడింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక (Huzurabad bypolls latest updates) ప్రచారంలోనూ మోత్కుపల్లి నర్సింహులు సహాయం తీసుకోవాలని, అందుకే ఆయన్ను దళిత బంధు పథకం (Dalita Bandhu scheme) కమిటీకి చైర్మన్‌గానూ నియమించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Also read : Mohan babu sensational comments: బెదిరించినా భయపడకుండా ఓటు వేశారు : మోహన్‌బాబు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News