Sabarimala Ayyappa temple reopen: నేడు తెరుచుకోనున్న శబరిమల అయ్యప్ప ఆలయం

Sabarimala Ayyappa temple reopen : తులామాసం పూజల కోసం శనివారం సాయంత్రం 5 గంటలకు శబరిమల అయ్యప్ప ఆలయం తెరుచుకోనుంది. ఆదివారం ఉదయం 5 గంటల నుంచి అక్టోబర్‌ 21 వరకు భక్తులను అనుమతించనున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 16, 2021, 08:48 AM IST
  • నేడు తులామాసం పూజల కోసం తెరుచుకోనున్న అయ్యప్ప ఆలయం
  • ఆదివారం నుంచి ఆలయంలోకి భక్తులకు అనుమతి
  • కరోనా నిబంధనలను పాటిస్తూ శబరిమల అయ్యప్ప ఆలయంలో తులామాసం పూజలు
Sabarimala Ayyappa temple reopen: నేడు తెరుచుకోనున్న శబరిమల అయ్యప్ప ఆలయం

Sabarimala Ayyappa temple to reopen on Saturday, devotees allowed from Sunday: శబరిమల అయ్యప్ప ఆలయాన్ని నేడు తెరవనున్నారు. తులామాసం (Thula Masam) పూజల కోసం శనివారం సాయంత్రం 5 గంటలకు ఆలయం తెరుచుకోనుంది. ఈ మేరకు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (Travancore Devaswom Board) ప్రకటన చేసింది. ఇక ఆదివారం ఉదయం 5 గంటల నుంచి అక్టోబర్‌ 21 వరకు భక్తులను (devotees) అనుమతించనున్నారు. 

శబరిమల అయ్యప్ప ఆలయంలో (Sabarimala Lord Ayyappa temple) కోవిడ్ నిబంధనలు పాటించనున్నారు. ఇక ప్రారంభోత్సవం సందర్భంగా ప్రస్తుత తంత్రీ కందరారు మహేష్ మోహనారు (Thanthri Kandararu Mahesh Mohanaru) సమక్షంలో దీపాలు వెలిగిస్తారు. ప్రస్తుత మెయిషంటి వి.కె. జయరాజ్ పొట్టి ఆలయంలో దీపారాధన చేస్తారు. ఆలయానికి వెళ్లే దారిలో 16 వ మెట్టు దగ్గర అగ్నిహోమం చేస్తారు.

Also Read : IPL 2021 Title Winning Movements: నెట్టింట వైరల్ అవుతున్న సీఎస్‌కే జట్టు విన్నింగ్

ఇక అయ్యప్పను దర్శించుకోవాలంటే వర్చువల్ క్యూ బుకింగ్ తప్పనిసరి. ఆలయాన్ని దర్శించుకునే భక్తులు తప్పని సరిగా డబుల్ డోస్ టీకా సర్టిఫికెట్‌ను లేదా RT-PCR నెగెటివ్ సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. అలాగే అక్టోబర్ 17 న (October 17) దేవస్థానం అధ్యక్షుడు ఎన్ వాసు ( Devaswom president N Vasu) ఇతర అధికారుల సమక్షంలో.. శబరిమల తదుపరి ప్రధాన పూజారిని (next head priest of Sabarimala) ఎంపిక చేయడానికి, లాటరీని నిర్వహిస్తారు. నెలవారీ పూజలు పూర్తయ్యాక తిరిగి అక్టోబర్ 21న (October 21) ఆలయాన్ని మూసివేస్తారు. ఇక మళ్లీ నవంబర్ 2 న (November 2) అత్త చితిర పూజ కోసం ఆలయాన్నీ మళ్లీ తెరుస్తారు. అయితే పూజ చేసిన మర్నాడే శబరిమల ఆలయాన్ని (Sabarimala Ayyappa temple) మూసివేస్తారు.

Also Read : Cryptocurrency: క్రిప్టోకరెన్సీపై ఆర్ఎస్ఎస్ ఛీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలకు కారణం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News