MAA Elections- Prakash Raj letter : సీసీటీవీ ఫుటేజ్‌ ఇవ్వండి అంటూ ప్రకాశ్‌రాజ్‌ లేఖ

MAA Elections Made Us A Laughing Stock Says Prakash Raj.. Seeks CCTV Footage: మా ఎన్నికలు జరిగిన రోజు చాలా ఘటనలు జరిగాయని లేఖలో పేర్కొన్నారు ప్రకాశ్‌రాజ్‌. ఆ భయంకర ఘటనలకు మీరే సాక్షి అంటూ కృష్ణ మోహన్‌ను ఉద్దేశించి పేర్కొన్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 14, 2021, 04:41 PM IST
  • మా ఎన్నికలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ ఇవ్వండి.
  • మా ఎన్నికలు జరిగిన రోజు చాలా భయంకర ఘటనలు జరిగాయి..
  • మా ఎన్నికల అధికారి కృష్ణ మోహన్‌కు.. ప్రకాశ్‌ రాజ్‌ లేఖ
MAA Elections- Prakash Raj letter : సీసీటీవీ ఫుటేజ్‌ ఇవ్వండి అంటూ ప్రకాశ్‌రాజ్‌ లేఖ

MAA Elections 2021 Prakash Raj sends letter seeking justice in MAAElections requests for CCTV Footage: 
మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ‘మా’ ఎన్నికలకు (MAA Elections) సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ ఇవ్వాలని కోరారు ప్రకాశ్‌ రాజ్. ఈ మేరకు ప్రకాశ్‌ రాజ్‌ (Prakash Raj) మా ఎన్నికల అధికారి కృష్ణ మోహన్‌కు (krishna mohan) ఒక లేఖ రాశారు.

మా ఎన్నికలు జరిగిన రోజు చాలా ఘటనలు జరిగాయని లేఖలో పేర్కొన్నారు ప్రకాశ్‌రాజ్‌. ఆ భయంకర ఘటనలకు మీరే సాక్షి అంటూ కృష్ణ మోహన్‌ను ఉద్దేశించి పేర్కొన్నారు. అలాగే మోహన్‌ బాబు, నరేశ్‌ ప్రవర్తన ఎలా ఉందో చూశామన్నారు. కొందరు మా సభ్యులపై వారు దాడి చేశారని ప్రకాశ్‌రాజ్‌ ఆరోపించారు. అందుకు సంబంధించిన కొన్ని విజువల్స్‌ లీక్‌ అయ్యాయన్నారు. మా సభ్యులంతా నిజం ఏంటో, పోలింగ్‌ (polling) ఎలా జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారని ప్రకాశ్‌రాజ్‌ లేఖలో పేర్కొన్నారు.

Also Read : Manchu Vishnu: బాలకృష్ణ ఆశీర్వాదం తీసుకున్నా..మెగాస్టార్‌‌ని కలుస్తా- మంచు విష్ణు

పోలింగ్‌ సమయంలో సీసీ కెమెరాల (CCTV cameras) గురించి మీరు వివరించారని లేఖలో పేర్కొన్నారు. అన్నింటినీ మీరు రికార్డు చేసుంటారని భావిస్తున్నానని ప్రకాశ్‌ రాజ్‌ (Prakash Raj) లెటర్‌‌లో రాశారు. ఆ సీసీటీవీ ఫుటేజీ ( CCTV Footage) మాకు అందించాల్సిందిగా అభ్యర్థిస్తున్నా అని కోరారు. మీరు వెంటనే స్పందించకపోతే అది డిలిట్‌ అయ్యే అవకాశాలున్నాయని ప్రకాశ్‌రాజ్‌ లేఖలో పేర్కొన్నారు. ప్రకాశ్‌ రాజ్ #justasking పేరిట గతంలో కూడా ప్రభుత్వంపై ఎన్నో ప్రశ్నలు సంధించిన విషయం తెలిసిందే. అలాగే ఇప్పుడు ఈ లేఖను కూడా #justasking హ్యాష్‌ట్యాగ్‌తో ట్విట్టర్‌‌లో పోస్ట్ చేశారు ప్రకాశ్‌రాజ్.

 

అయితే ప్రకాశ్‌రాజ్‌ (Prakash Raj) రాసిన లెటర్‌‌పై ఎన్నికల అధికారి కృష్ణ మోహన్‌ స్పందించారు. ఎన్నికలకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ అంతా భద్రంగానే ఉందని తెలిపారు. నిబంధనల ప్రకారం మాత్రమే సీసీ ఫుటేజ్‌ ఇవ్వాల్సి ఉంటుందని కృష్ణ మోహన్‌ (krishna mohan) తెలిపారు.

Also Read : 14 Movie Teaser: 14 మూవీ టీజర్.. ఒక అమ్మాయి.. అబ్బాయి కోసం రావాలంటే.. ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News