Dussehra Celebrations: దసరా మహోత్సవాలకు ఏపీ ప్రభుత్వం సిద్ధమౌతోంది. శరన్నవరాత్రి మహోత్సవాలకు పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేస్తోంది పోలీసు శాఖ. భారీగా పోలీసులు, సీసీ కెమేరాల పర్యవేక్షణతో ఉత్సవాలు నిర్వహించనున్నారు.
దసరా ఉత్సవాలు(Dussehra Celebrations)అక్టోబర్ 7 నుంచి 15వ తేదీ వరకూ అత్యంత వైభవంగా జరగనున్నాయి. విజయవాడ కనకదుర్గ ఆలయ ప్రాంగణంలో శరన్నవరాత్రి మహోత్సవాలకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దసరా ఉత్సవాల ఏర్పాట్లను మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సమీక్షించారు. అన్ని శాఖలతో సమన్వయంతో పనిచేస్తూ దసరా ఉత్సవాల్ని విజయవంతంగా నిర్వహించాలని మంత్రి శ్రీనివాస్ సూచించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా..మంచినీరు, పారిశుద్ధ్యం, ప్రసాదాల కౌంటర్ల ఏర్పాటులో అలసత్వం చేయవద్దన్నారు. ఉత్సవాల్ని గతంలో కంటే అత్యంత వైభవంగా నిర్వహించాలని సూచించారు.
మరోవైపు దసరా మహోత్సవాలకు భారీగా పోలీసుల్ని మొహరించనున్నారు. 3 వేలమందితో పహారా నిర్వహించనున్నారు. సీసీ కెమేరాల పర్యవేక్షణ, కంట్రోల్ రూమ్, సమాచార కేంద్రాల్ని ఏర్పాటు చేస్తున్నారు. దూరం నుంచి వచ్చేవారికి ప్రత్యేకంగా పార్కింగ్ ప్రదేశాలు కేటాయిస్తున్నారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రోజుకు పదివేలమంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కోవిడ్ సంక్రమణ నేపధ్యంలో పదేళ్లలోపు, 60 ఏళ్లు పైబడినవారికి అనుమతి లేదని విజయవాడ(Vijayawada) నగర కమీషనర్ బత్తిని శ్రీనివాసులు తెలిపారు. ఘాట్‌లో స్నానానికి అనుమతిలేదన్నారు. కెనాల్ రోడ్‌లోని వినాయకుడి గుడి నుంచి భక్తుల క్యూలైన్ ప్రారంభం కానుంది. దొంగతనాలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నారు. అల్లరిమూకలపై ప్రత్యేక నిఘా ఉంచుతున్నామని కమీషనర్ చెప్పారు. ఇబ్బందులు ఎదురైతే 100 లేదా 7328909090 నెంబర్లకు ఫోన్ చేయాల్సిందిగా కోరారు. భక్తుల సౌకర్యార్ధం కమాండ్ కంట్రోల్ రూమ్, వన్‌టౌన్, భవానీపురం పోలీస్ స్టేషన్లతో పాటు రైల్వే స్టేషన్, బస్టాండ్, పోలీస్ కమీషనరేట్ కార్యాలయం, స్టేట్ గెస్ట్‌హౌస్ ప్రాంతాల్లో పోలీసు సమాచార కేంద్రాల్ని ఏర్పాటు చేశారు.
దసరా ఉత్సవాల సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Diversions)విధించారు. విజయవాడ, ఇబ్రహీంపట్నం మద్య వాహనాల్ని సీతమ్మవారి పాదాలు, పీఎస్ఆర్ విగ్రహం, ఘాట్‌రోడ్, స్వాతి జంక్షన్ మార్గాల్లో అనుమతించనున్నారు. ఈ వాహనాల్ని కనకదుర్గా ఫ్లై ఓవర్ మీదుగా మళ్లిస్తారు. కుమ్మరిపాలెం నుంచి అమ్మవారి గుడికు వచ్చే వాహనాల్ని గుప్తా సెంటర్, చెరువు సెంటర్, సితార సెంటర్, స్వాతి సెంటర్ నుంచి ఫ్లైఓవర్‌కు మళ్లిస్తారు. ఇక సీతమమ్మ వారి పాదాల నుంచి గుడికి చేరుకునే వాహనాలు గద్ద బొమ్మ, కేఆర్ మార్కెట్ పంజా మార్కెట్, గణపతిరావు రోడ్డు, చిట్టినగర్ సొరంగం మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.
Also read: Facebook Outage: ఫేస్బుక్ సేవలు ఆగడానికి కారణం ఎవరు, అందరూ ఊహించింది కాదా, భారీ నష్టమేనా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook