/telugu/photo-gallery/rain-alert-expected-in-these-4-key-districts-of-telugu-states-imd-weather-alert-issued-rn-180901 AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక 180901

Bad Cholesterol: కొలెస్ట్రాల్. మనిషి శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్ ఉంటుంది. ఒకటి చెడుదైతే రెండవది మంచిది. చెడు కొలెస్ట్రాల్ అనేది గుండె జబ్బులకు దారి తీస్తోంది. ఈ క్రమంలో కొలెస్ట్రాల్‌ను కరిగించే ఆహార పదార్ధాల జాబితాను పరిశోధకులు విడుదల చేశారు.

మనిషి శరీరానికి గుడ్ కొలెస్ట్రాల్( HDL)ఎంత మంచిదో..బ్యాడ్ కొలెస్ట్రాల్(LDL)అంత ప్రమాదకరం. గుండె జబ్బులతో పాటు ఇతర వ్యాధులకు దారి తీస్తుంది బ్యాడ్ కొలెస్ట్రాల్. ఈ తరుణంలో హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధకులు కొన్ని రకాల ఆహార పదార్ధాల జాబితా విడుదల చేశారు. ఈ ఆహార పదార్ధాలు కొవ్వును కరిగించడమే కాకుండా మీ గుండెను పదికాలాలపాటు పదిలంగా ఉంచుకోవచ్చంటున్నారు. ఆ ఆహార పదార్ధాలేంటనేది ఇప్పుడు తెలుసుకుందాం.

కూరగాయలు(Vegetables)

కూరగాయలు అధికంగా తీసుకుంటే వాటిలో ఉండే ఫైబర్ శరీరానికి చాలా శక్తిని ఇస్తుంది. శరీరంలోని చెడు కొవ్వును కరిగిస్తుంది. వంకాయ, బెండకాయలో అధికంగా ఉండే ఫైబర్..కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. బ్రకోలి, చిలకడదుంప కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.

నట్స్ మరియు తృణ ధాన్యాలు(Nuts and Millets)

రెండవది నట్స్, తృణ ధాన్యాలు. వీటిని ప్రతి నిత్యం తీసుకోవడం వల్ల ఎల్‌డీఎల్‌ను తగ్గించవచ్చు. నట్స్‌లో ఉండే ప్రోటీన్ రక్తంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. తృణధాన్యాల్లో ఉండే ఫైబర్ కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఓట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఓట్స్‌లో అధికంగా ఉండే ఫైబర్ బీటా గ్లూకాన్ రూపంలో ఉంటుంది. ఆకలిని తగ్గించడమే కాకుండా కొవ్వును కరిగిస్తుంది. 

బీన్స్ మరియు ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్(Beans and Omega Fatty 3 Acids)

త్వరగా ఆకలి వేయకుండా ఉండేందుకు బీన్స్‌ను(Beans) ఆహారంగా తీసుకోండి. ఇందులో ఉండే హై ప్రోటీన్స్ కారణంగా త్వరగా ఆకలి వేయదు. బీన్స్ ఎక్కువగా తీసుకోవడం ద్వారా బరువు తగ్గించుకోవచ్చు. ఇక వెజిటబుల్ ఆయిల్స్ విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. వెజిటబుల్ ఆయిల్స్‌లో అంతగా కొలెస్ట్రాల్ ఉండదు. ఇందులో ఉండే విటమిన్ ఇ, కేలు చెడు కొవ్వును నియంత్రిస్తాయి. ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ ఉన్న చేపల్ని తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ వేగంగా తగ్గించుకోవచ్చు. ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ వల్ల గుండె జబ్బులు కూడా తగ్గుతాయి.

సోయా బీన్స్(Soya Beans)

ఇక చివరిగా సోయా బీన్స్ చెడు కొలెస్ట్రాల్‌ను(Bad Cholesterol) తగ్గించేందుకు మంచి ఫుడ్. ప్రతి రోజూ సోయా ఉత్పత్తుల్ని తీసుకోవడం వల్ల ఎల్‌డీఎల్ తగ్గుతుంది. సాచ్యురేటెడ్ ఫ్యాట్ తక్కువగా ఉంటుంది. ఈ ఆహార పదార్ధాలతో పాటు ఫైబర్ సప్లిమెంట్స్ తీసుకుంటే మన శరీరంలో సాల్యుబుల్ ఫైబర్ పెరుగుతుంది.

Also read: Ys Sharmila Padayatra: తెలంగాణలో వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థాన పాదయాత్ర త్వరలో, రూట్‌మ్యాప్ ఇలా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Section: 
English Title: 
Top ten best food habits to reduce band cholesterol and triglycerides and health benefits
News Source: 
Home Title: 

Bad Cholesterol: మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను దూరం చేసే ఆహార పదార్ధాలివే

 Bad Cholesterol: మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను దూరం చేసే ఆహార పదార్ధాలివే
Caption: 
Bad Cholesterol ( file photo)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగించే ఆహార పదార్ధాల జాబితా విడుదల చేసిన హార్వర్డ్ స్కూల్ పరిశోధకులు

కూరగాయల్లో అదికంగా ఉండే ఫైబర్ బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుందంటున్న పరిశోధకులు

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అదికంగా ఉండే చేపలతో గుండె పదిలం

Mobile Title: 
Bad Cholesterol: మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను దూరం చేసే ఆహార పదార్ధాలివే
Md. Abdul Rehaman
Publish Later: 
No
Publish At: 
Sunday, October 3, 2021 - 11:33
Created By: 
Md. Abdul Rehaman
Updated By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman
Request Count: 
620
Is Breaking News: 
No