Petrol Price Fall: దేశంలో రోజు రోజుకు పెట్రోల్, డీజిల్, గ్యాస్ మరియు అన్ని రకాల నిత్యావసర ధరలు పెరుగుతూనే ఉన్నాయి. వీటి వలన సామాన్యుల జీవనంపై ఒత్తిడే కాదు బ్రతకటం కూడా కష్టంగా మారుతుంది. నిపుణుల అధ్యయనాల ప్రకారం, పెట్రోల్ (Petrol), డీజిల్ (Diesel) లను జీఎస్టి (GST) పరిధిలో చేరిస్తే భారీగానే వీటి ధరలు తగ్గుతున్నాయని వాపోతున్నారు.
చాలాకాలం నుండి డీజిల్-పెట్రోల్‌ను (Petro-Diesel)జీఎస్టి (GST) పరిధిలోకి తీసుకురావాలనే చర్చ జరుగుతోంది. కానీ, దీనిపై కేంద్ర మరియు రాష్ట్రాలు ఇంకా అంగీకరించలేదు. ఫలితంగా డీజిల్-పెట్రోల్ ధరలు ఇంకా GST పరిధిలోకి చేర్చబడలేదు. పెట్రో-డీజిల్ ధరలను జీఎస్టి పరిదిలోనికి తీసుకురావటానికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, రాష్ట్రాల సహాయం లేకుండా ఇది అస్సలు సాధ్యపడదని కేంద్ర ప్రభుత్వం తెలుపుతుంది. దీని ఫలితంగా పెట్రోల్-డీజిల్ ధరలు పలు రాష్ట్రాల్లో గరిష్టంగా రూ. 108 కి చేరుకున్నాయి.
పెట్రో-డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటటం...విపక్షాలు కేంద్రాన్ని ఈ విషయంపై దుమ్మెత్తిపోయటం.... సామాన్య ప్రజలు కూడా పెరిగిన ధరలతో ఇబ్బంది పడటం వలన కేంద్ర ప్రభుత్వంపై విమర్శలకు దారీ తీస్తుంది. ప్రస్తుతం ప్రజల్లో ఒక ప్రశ్న తలెత్తుతుంది.. పెట్రో-డీజిల్ ధరలను జీఎస్టి పరిధిలో చేరిస్తే ఎంత మేరకు ధరలు తగ్గుతాయి..?ఎలా తగ్గుతాయి..? ఎందుకు ప్రభుత్వాలు ఈ దిశగా చర్యలు తీసుకోవట్లేదో ఇపుడు తెలుసుకుందాం..!!
డీజిల్-పెట్రోల్‌పై ఎంత పన్ను విధించబడుతుంది..??
ప్రస్తుతం, డీజిల్-పెట్రోల్‌పై 60 శాతం పన్ను విధించబడుతుంది. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వాటా ఉంటుంది. 16 సెప్టెంబర్ 2021 నాటి డీజిల్-పెట్రోల్ ధరను గమనిస్తే... ధరలో సగానికి పైగా పన్ను మరియు డీలర్ కమీషన్‌గా వెళుతుందని తెలుస్తుంది. డీజిల్ ధర ప్రస్తుతం ఢిల్లీలో లీటరుకు రూ. 88.62, ఇందులో డీజిల్ ధర లీటరుకు రూ .41.27 ఉండగా, డీలర్ కమీషన్ లీటరుకు రూ .2.59 మరియు మిగిలిన రూ. 43.86 మొత్తం పన్నుగా చెల్లిస్తున్నాము. మరోవైపు, పెట్రోల్ ధరల విషయానికి వస్తే, ఢిల్లీలో దీని ధర రూ. 101.19. ఇందులో పెట్రోల్‌పై రూ .41.10 మరియు డీలర్ కమీషన్ రూ. 3.84, మిగిలిన రూ. 56.25 పన్నుగా చెల్లిస్తున్నాము.
డీజిల్-పెట్రోల్ లను GST అమలు చేస్తే ధర ఎంత తగ్గుతుంది..??
డీజిల్-పెట్రోల్ కూడా GST పరిధిలోకి వస్తే, వాటిపై చెల్లించే పన్ను తగ్గించబడుతుంది. GST రూల్స్ ప్రకారం, గరిష్ట పన్ను 28 శాతం చెల్లించాలి, అయితే ఇటువంటి పరిస్థితిలో, డీజిల్‌పై పన్ను రూ. 43.86 కి బదులుగా 22-24 రూపాయలకు దగ్గరగా ఉంటుంది. అదే సమయంలో, పెట్రోల్‌పై పన్ను రూ. 56.25 కి బదులుగా రూ.25-27 ఉంటుంది.
కొంతకాలం క్రితం వచ్చిన ECOWRAP నివేదిక ప్రకారం, GST పరిధిలోకి వచ్చిన తర్వాత, పెట్రోల్ ధర సుమారు రూ.30 మరియు డీజిల్ ధర రూ .20 తగ్గుతాయి. అంటే, ఒకవేళ పెట్రో-డీజిల్ లను జీఎస్టి పరిధిలో చేరిస్తే... ఢిల్లీలో పెట్రోల్ లీటర్‌కు రూ. 72 మరియు డీజిల్ లీటర్‌కు రూ.70 ఉండవచ్చు.
డీజిల్-పెట్రోల్ GST పరిదిలోకి చేరిస్తే ఎవరు నష్టపోతారు..??
ఒకవేళ డీజిల్-పెట్రోల్ GST పరిదిలోకి గనుక చేరిస్తే, మొదటగా నష్టపోయేది రాష్ట్రాలు వాటి ప్రభుత్వాలు. ఈ కారణం చేతనే, ఇప్పటి వరకు డీజిల్-పెట్రోల్ లను జీఎస్టి పరిధిలోకి తీసుకురాలేదు. ఎందుకంటే రాష్ట్రాలు పన్ను రూపంలో పొందే ఆదాయాలను కోల్పోటానికి సిద్దంగా లేవు. కావున పెట్రోల్-డీజిల్‌ను జీఎస్టి GST పరిధిలోకి తీసుకురావడానికి రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. ఫలితంగా కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని లక్షల కోట్ల రూపాయాలను నష్టాన్ని చవిచూస్తుంది మరియు ఇది GDP లో 0.4 శాతానికి సమానం.
Also Read: Shocking News: వీడు చదివేదే 6వ తరగతి.. కానీ బ్యాంకు అకౌంట్లో రూ. 900 కోట్లు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook