krishnam raju: ఆస్పత్రిలో చేరిన సీనియర్ నటుడు కృష్ణంరాజు! తన ఆరోగ్యం బాగానే ఉందన్న రెబల్ స్టార్

Krishnam Raju: సీనియర్ నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరారు. కేవలం సాధారణ ఆరోగ్య పరీక్షల నిమిత్తమే తాను ఆస్పత్రికి వచ్చానని ఆయన వెల్లడించారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 14, 2021, 03:05 PM IST
krishnam raju: ఆస్పత్రిలో చేరిన సీనియర్ నటుడు కృష్ణంరాజు! తన ఆరోగ్యం బాగానే ఉందన్న రెబల్ స్టార్

Krishnam Raju: సీనియర్ నటుడు కృష్ణంరాజు మంగళవారం హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రి (Apollo Hospital)కి వచ్చారు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేదని సామాజిక మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి. దీనిపై కృష్ణంరాజు(Krishnam Raju) స్పందించారు. కేవలం సాధారణ ఆరోగ్య పరీక్షల నిమిత్తమే తాను ఆస్పత్రికి వచ్చానని వివరించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాయిధరమ్‌తేజ్‌(Sai Dharam Tej) ఆరోగ్య పరిస్థితి గురించి అతడి కుటుంబ సభ్యులతో మాట్లాడినట్లు తెలిపారు. సాయితేజ్‌ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానన్నారు. త్వరలో యూకే వెళ్లాల్సి రావడంతో రొటీన్‌ హెల్త్‌ చెకప్‌ చేసుకోవడానికి ఆస్పత్రికి వచ్చినట్లు వివరించారు.

ప్రస్తుతం కృష్ణంరాజు ‘రాధేశ్యామ్‌(’Radheshyam)లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రభాస్, పూజాహెగ్డే జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి రాధాకృష్ణకుమార్‌ దర్శకత్వం వహించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది.

Also Read: Tollywood: సినిమా పరిశ్రమ సమస్యలపై ముఖ్యమంత్రి జగన్‌తో చిరంజీవి బృందం భేటీ ఖరారు

సినీ ప్రస్థానం..
పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు కృష్ణంరాజు స్వస్థలం. రెబల్ స్టార్‌(Rebel Star)గా తెలుగు ప్రేక్షకుల గుర్తింపు సాధించిన కృష్ణంరాజు.. తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో 183 సినిమాల్లో నటించారు. జీవన తరంగాలు, కృష్ణవేణి, భక్త కన్నప్ప, అమరదీపం, సతి సావిత్రి, కటకటాల రుద్రయ్య, మన ఊరి పాండవులు, బొబ్బిలి బ్రహ్మన్న, మరణ శాసననం, అంతిమ తీర్పు, పల్నాటి పౌరుషం తదితర చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చాయి. ప్రస్తుతం ఆయన వయస్సు 81 ఏళ్లు. 1966లో చిలకా గోరింక చిత్రం ద్వారా ఆయన సినీ అరంగేట్రం చేశారు. మూడుసార్లు నంది అవార్డులు, ఐదుసార్లు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకున్నారు.

రాజకీయ ప్రస్థానం..
1990లలో ఆయన క్రియాశీల రాజకీయాల్లోనూ సేవలందించారు. భారతీయ జనతా పార్టీ(బీజేపీ), ప్రజారాజ్యం పార్టీ(పీఆర్పీ)లో ఆయన గతంలో పనిచేశారు. బీజేపీలో రెండు సార్లు(కాకినాడ, నర్సాపూర్ నియోజకవర్గాల నుంచి) లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1999-2004 మధ్యకాలంలో ధివంగత వాజ్‌పేయి కేబినెట్‌లో కేంద్ర విదేశాంగ వ్యవహారాల సహాయ మంత్రిగా కృష్ణంరాజు సేవలందించారు. 2009లో ఆయన చిరంజీవి సారథ్యంలోని ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ తర్వాత క్రమంగా క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News