భారత సంతతికి చెందిన ఓ యువకుడు అరుదైన ఘనత సాధించాడు. కేవలం 19 ఏళ్లకే 100 కోట్లు సంపాదించి చూపించాడు . నమ్మసక్యంగా లేదు కదూ..చదవండి మీకే అర్థమౌతుంది...భారతీయ సంతతికి చెందిన అక్షయ్ రూపారెలియా కళాశాల విద్యనభ్యసిస్తున్నాడు. వ్యాపారంలో రాణించాలనే బలమైన కాంక్ష ఉన్న అతను .. బిజినెస్ ప్రారంభించేందుకు బంధువుల నుంచి అప్పుగా 7 వేల డాలర్లు తీసుకున్నాడు. ఈ పెట్టుబడితో స్థిరాస్థి సంస్థ ప్రారంభించాడు. కేవలం ఏడువేల డాలర్లతో వ్యాపారాన్ని ప్రారంభించి..అతను దానిని వందకోట్ల సంస్థగా మార్చాడు. కేవలం 16 నెలల్లోనే తన వ్యాపారాన్ని 12 మిలియన్ పౌండ్ల (103 కోట్ల రూపాయలకు పైగా) కు చేర్చాడు. ఫలితంగా బ్రిటన్ కోటీశ్వరుల జాబితాలో 19 ఏళ్ల భారత సంతతి యువకుడు స్థానం సంపాదించి సత్తాచాటాడు. దీంతో బ్రిటన్ లో అత్యంత పిన్న వయస్కుడైన కోటీశ్వరుడిగా నిలిచాడు.
అక్షయ్ రూపారెలియా ఏం చేశాడో తెలుసా...
అక్షయ్ రూపారెలియా విద్యార్థిగా ఉంటూనే ‘డోర్ స్టెప్స్.కో.యూకే’ వెబ్ సైట్ కు రూపకల్పన చేసిన అక్షయ్.. అనతికాలంలోనే దానిని యూకేలో 18వ అతిపెద్ద స్థిరాస్తి సంస్థగా తీర్చిదిద్దాడు. ఈ వెబ్ సైట్ ప్రత్యేకత ఏంటంటే.. యూకేలో స్వయం ఉపాధి పొందుతున్న తల్లుల నుంచి స్థిరాస్తి సమాచారం సేకరించి, దానిని తమ సైట్లో పోస్ట్ చేస్తుంటారు.
అక్స్ ఫర్డ్ వర్శిటీ ఛాన్స్ వదులుకున్నా: అక్షయ్
తన ఎదుగుదల గురించి అక్షయ్ స్పందించాడు...తానింతవరకు 100 మిలియన్ పౌండ్ల స్థిరాస్తులను తన వెబ్ సైట్ ద్వారా విక్రయించానని తెలిపాడు. ఆర్థిక, గణిత శాస్త్రాల్లో ఉన్నత విద్యకోసం అక్స్ ఫర్డ్ యూనివర్సిటీ నుంచి అక్షయ్ కు అవకాశం వచ్చినప్పటికీ... తన ఆన్ లైన్ వెబ్ సర్వీసును విస్తరించాలని భావించి దానిని వదులుకున్నానని అక్షయ్ వెల్లడించాడు.