IND vs ENG 4th test: ఇంగ్లండ్‌ నడ్డి విరిచిన Jasprit Bumrah.. బుమ్రా ఖాతాలో మరో రికార్డ్

Jasprit Bumrah, fastest Indian pacer to claim 100 Test wickets: లండన్‌లోని ఓవల్ మైదానం వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో బుమ్రా మొత్తం 4 వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. ఈ నాలుగు వికెట్లతో టెస్ట్ కెరీర్‌లో వేగంగా 100 వికెట్లు తీసిన ఆటగాడిగా జస్ప్రిత్ బుమ్రా రికార్డ్ సొంతం చేసుకున్నాడు.

Written by - Pavan | Last Updated : Sep 7, 2021, 08:25 AM IST
IND vs ENG 4th test: ఇంగ్లండ్‌ నడ్డి విరిచిన Jasprit Bumrah.. బుమ్రా ఖాతాలో మరో రికార్డ్

Jasprit Bumrah, fastest Indian pacer to claim 100 Test wickets: ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగవ టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన జస్ప్రిత్ బుమ్రా తన ఖాతాలో మరో రికార్డును వేసుకున్నాడు. ఇది ఎలాంటి రికార్డు అంటే.. కపిల్ దేవ్ పేరిట ఉన్న రికార్డును తుడిచేసిన రికార్డు. అవును.. లండన్‌లోని ఓవల్ మైదానం వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో బుమ్రా మొత్తం 4 వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. ఈ నాలుగు వికెట్లతో టెస్ట్ కెరీర్‌లో వేగంగా 100 వికెట్లు తీసిన ఆటగాడిగా జస్ప్రిత్ బుమ్రా రికార్డ్ సొంతం చేసుకున్నాడు.
 
కపిల్ దేవ్ 1980లోనే ఈ రికార్డును సొంతం చేసుకున్నప్పటికీ.. కపిల్ దేవ్ (Kapil Dev) టెస్టుల్లో 100 వికెట్లు తీయడానికి 25 టెస్ట్ మ్యాచ్‌లు ఆడగా.. జస్ప్రిత్ బుమ్రా 24 టెస్ట్ మ్యాచ్‌ల్లోనే ఆ మైలురాయిని అందుకున్నాడు. కేవలం వేగంగా 100 వికెట్లు తీయడమే కాకుండా.. మరే ఇతర భారత బౌలర్‌కు సాధ్యం కాని రీతిలో 22.45 అతి స్వల్పమైన సగటుతో 100 వికెట్లు తీసిన బౌలర్ కూడా బుమ్రానే కావడం ఇక్కడ మరో విశేషం. 

2018లో కేప్ టౌన్‌లో సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌తో జస్ప్రిత్ బుమ్రా (Jasprit Bumrah) టెస్ట్ కెరీర్ ప్రారంభించాడు. అప్పటి నుంచి విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా జట్టులో కీలకంగా వ్యవహరిస్తూ ఎప్పటికప్పుడు తనని తాను నిరూపించుకుంటూ వస్తున్నాడు. 

Also read : IND vs ENG: చెలరేగిన భారత బౌలర్లు...నాలుగో టెస్ట్‌లో టీమిండియా ఘన విజయం

ఇదే రికార్డును అందుకోవడానికి ఇర్ఫాన్ పఠాన్‌కి (Irfan Pathan) 28 టెస్ట్ మ్యాచ్‌లు అవసరం కాగా.. మొహమ్మద్ షమికి (Mohammad Shami) 29 టెస్ట్ మ్యాచ్‌లు అవసరం అయ్యాయి. టెస్ట్ కెరీర్‌లో అత్యధిక వికెట్స్ తీసుకున్న భారత బౌలర్లలో ప్రస్తుతం జస్ప్రిత్ బుమ్రా 22వ స్థానంలో ఉన్నాడు. స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లె (Anil Kumble) 619 వికెట్లతో ఈ జాబితాలో అందరికంటే నెంబర్ 1 స్థానంలో కొనసాగుతున్నాడు.

Also read : Ind Vs Eng : టీమిండియాకు షాక్..హెడ్ కోచ్ రవిశాస్త్రికి కరోనా పాజిటివ్..మరో ముగ్గురు సభ్యులు కూడా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News