Joe Biden on Afghan Issue: ఆఫ్ఘనిస్తాన్ నుంచి బలగాల ఉపసంహరణ పూర్తయ్యాక అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. బలగాల ఉపసంహరణను సమర్ధించుకున్నారు. ఇకపై విదేశీగడ్డపై అడుగుపెట్టమని అంటున్నారు.
ఆగస్టు 31 డెడ్‌లైన్‌లోగా ఆఫ్ఘన్ నేల నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ పూర్తయింది. బలగాల ఉపసంహరణపై తాము తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ సమర్ధించుకున్నారు. కేవలం దేశ ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. బలగాల ఉపసంహరణ సరైన, తెలివైన నిర్ణయమని..దేశానికి మేలు చేసే అత్యుత్తమ నిర్ణయమని జో బిడెన్ వ్యాఖ్యానించారు.ఆఫ్ఘనిస్తాన్(Afghanistan)నుంచి సైన్యాన్ని వెనక్కి రప్పించాలని ప్రజలు, మిలిటరీ సలహాదారులు, సర్వీస్ ఛీఫ్‌లు కోరుకున్నారన్నారు. మెరుగైన భవిష్యత్ కోసం బలగాల ఉపసంహరణ నిర్ణయం ఉపయోగపడుతుందన్నారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి పౌరుల తరలింపు ప్రక్రియ సజావుగా సాగేందుకు సైనికులు ప్రాణాల్ని పణంగా పెట్టారని..ధైర్య సాహసాలు ప్రదర్శించారని కొనియాడారు. ఒక్క అమెరికా తప్ప..ప్రపంచ చరిత్రలో ఏ దేశం ఇంత గొప్పగా వ్యవహరించలేదన్నారు.
ఇక నుంచి విదేశీ గడ్డపై అడుగుపెట్టకుండానే ఉగ్రవాదాన్ని నిర్మూలించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు జో బిడెన్(Joe Biden). ఆఫ్ఘన్లో యుద్ధం ముగిసిందని..ఆ క్రమంలో సవాళ్లు ఎదుర్కొన్న నాలుగవ అధ్యక్షుడు తానని చెప్పుకున్నారు. తనకు ముందు అధ్యక్షుడిగా పనిచేసినవారు తాలిబన్లతో(Talibans)శాంతి ఒప్పందంపై సంతకం చేశారన్నారు. యుద్ధానికి ముగింపు పలుకుతానని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నానన్నారు. ఇక నుంచి ఆఫ్ఘన్ లేదా ఇతర ప్రపంచదేశాల్లో అమెరికా సైనికులు అడుగుపెట్టకుండానే ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తామన్నారు. అతి తక్కువమంది సేవల్ని ఉపయోగించుకుంటామన్నారు. అమెరికా, మిత్రదేశాలకు ఎవరైనా హాని తలపెట్టాలని చూస్తే సహించమని..వెంటాడి, వేటాడి మట్టుబెడతామని ఉగ్రవాదులకు హెచ్చరించారు.
Also read: Talibans Ruling: ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లకు రానున్నది గడ్డుకాలమే, ఆ సమస్యే కీలకం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook