ప్రధాని నరేంద్రమోదీ ఢిల్లీలో బీజేపీ పార్టీ కొత్త కార్యాలయాన్ని ప్రారంభించారు. ఢిల్లీలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గ్‌లో నిర్మించిన పార్టీ కొత్త కార్యాలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ కొద్దిసేపటి కిందట ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, అగ్రనేత ఎల్కే అద్వానీతో పాటు బీజేపీ పార్టీ సీనియర్ నేతలు కూడా పాల్గొన్నారు. మోదీ, అమిత్ షా గత సంవత్సరం ఆగస్టులో కొత్త కార్యాలయానికి పునాది రాయి వేశారు. దీనిని ఓ ముంబై కంపెనీ నిర్మించింది.
ఈ సందర్భంగా కొత్త కార్యాలయంలో ఏర్పాటు చేసిన వేదికపై మోదీ ప్రసంగించారు. 'నిర్ణీత కాలవ్యవధిలో బీజేపీ ప్రధాన కార్యాలయ కట్టడాన్ని పూర్తిచేసినందుకు అమిత్ షా, అతని బృందానికి కృతజ్ఞతలు. డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ మరియు పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ వంటి గొప్ప వ్యక్తులతో మన ప్రయాణం ప్రారంభమైంది. కార్యకర్తలు పార్టీకి తమ జీవితాన్ని ఇచ్చారు" అన్నారు.
'ఒక రాజకీయ పార్టీని ఏర్పాటుచేయడం భారతదేశంలో కష్టమైన పనేమీ కాదు. అనేక పార్టీలకు సొంత అభిప్రాయాలు, సిద్ధాంతాలు ఉంటాయి. ఇవి అన్నీ దేశ ప్రజాస్వామ్యానికి అద్దంపడతాయి. స్వాతంత్ర్యం తరువాత జన సంఘ్ మరియు బీజేపీ నాయకులు అనేక ప్రజా పోరాటాలకు నాయకత్వం వహించి నడిపించడంలో ముందంజలో ఉన్నారు. దేశ భక్తికి కట్టుబడి ఉన్న పార్టీ మనది. అటల్‌జీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం భారతీయుల్లో ఆశలు, కోరికలు రేకెత్తించింది" అని అన్నారు.
BJP's new headquarters at Kotla Marg to be inaugurated tomorrow. #Delhi pic.twitter.com/lyAw1uPhdQ
— ANI (@ANI) February 17, 2018
Watch LIVE: PM Shri @narendramodi inaugurates new Bharatiya Janata Party HQ in New Delhi. https://t.co/giWHt228Fk
— BJP (@BJP4India) February 18, 2018