Karnataka: దక్షిణాది రాష్ట్రాల మధ్య జల వివాదం ప్రారంభమైంది. ఓ వైపు ఏపీ, తెలంగాణల మధ్య వివాదం కొనసాగుతుండగానే..కర్ణాటక-తమిళనాడు రాష్ట్రాల మధ్య పేచీ ప్రారంభమైంది. ఆ వివాదానికి కారణం ఇదీ.
దక్షిణాది రాష్ట్రాల మధ్య మరోసారి జల వివాదాలు మొదలవుతున్నాయి. శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు(Srisailam Power Project) విషయంలో ఇప్పటికే తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య వివాదం నడుస్తోంది. రెండు రాష్ట్రాల పంచాయితీ ఢిల్లీకు చేరింది. ఇప్పుడు కొత్తగా కర్ణాటక-తమిళనాడు రాష్ట్రాల మధ్య పేచీ ప్రారంభమవుతోంది. కర్ణాటక రాష్ట్రం కావేరి నది(Kaveri River)పై మేకెదాటు ప్రాజెక్టు నిర్మాణం తలపెట్టడమే దీనికి కారణం.
మేకెదాటు ప్రాజెక్టు నిర్మాణం విషయంలో కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప(Yeddyurappa)స్పందించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం విషయమై..సామరస్యంగా సాగిపోదామని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ (Stalin)కు లేఖ రాశామని..అయితే ఆయన స్పందించలేదని యడ్యూరప్ప తెలిపారు. ప్రాజెక్టును అడ్డుకోవడం ఎవరికీ సాధ్యం కాదని స్పష్టం చేశారు. మేకెదాటు ప్రాజెక్టును నిర్మించి తీరుతామని..ఎవరూ అడ్డుకోలేరంటూ తమిళనాడు ప్రభుత్వానికి పరోక్షంగా సవాలు విసిరారు. ప్రాజెక్టును కొనసాగిస్తామని..దీనివల్ల రెండు రాష్ట్రాలకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. చట్ట పరిధిలోనే ప్రాజెక్టు నిర్మాణం ఉంటుందని..అనుమానాలు అవసరం లేదని తెలిపారు.
Also read: JEE Mains Exams Schedule: జేఈఈ మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల, ఏ పరీక్ష ఎప్పుడంటే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook