Coviself Test Kit: కరోనా నిర్ధారణ పరీక్షలకు ఇక ల్యాబ్ లేదా ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. డబ్బులు వృధా చేసుకోవల్సిన అవసరం లేదు. తక్కువ ఖర్చుతో ఇంట్లోనే టెస్ట్ చేసుకోవచ్చు. ఎలాగంటే..
కరోనా వైరస్ మహమ్మారి ( Coronavirus)ప్రారంభమైనప్పటి నుంచి కోవిడ్ నిర్ధారణ పరీక్ష(Covid19 Test) లనేవి ఓ ప్రహసనంగా మారాయి. ఇటీవల పరిస్థితి కాస్త మెరుగు పడినా మొన్నటి వరకైతే క్యూలో ఉండాల్సిన పరిస్థితి. లేదా టెస్ట్ కిట్లు లేవని వెనక్కి రావల్సిన పరిస్థితి. అంతకుమించి ప్రైవేటులో అయితే ఎక్కువ ఖర్చు కూడా అయ్యేది. కరోనా ఫస్ట్‌వేవ్‌లో అయితే యాంటీజెన్ టెస్ట్‌కే 3 వేలు ఇవ్వాల్సి వచ్చేది. ఇప్పుడా పరిస్థితిలో మార్పు వచ్చింది. 5 వందల నుంచి వేయి రూపాయల వరకూ వసూలు చేస్తున్నారు. అది కూడా ల్యాబ్ లేదా ఆసుపత్రులకు వెళ్లి చేయించుకోవాలి. ఇప్పుడా పరిస్థితి ఉండదు మీకు. ఆన్‌లైన్‌లో టెస్ట్ కిట్లు లభ్యమవుతున్నాయి. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసి..ఇంట్లోనే టెస్ట్ చేసుకోవచ్చు.
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజమైన ఫ్లిప్‌కార్ట్ (Flipkart) కరోనా యాంటీజెన్ టెస్ట్ కిట్లను(Corona antigen test kits) ఆన్‌లైన్‌లో విక్రయిస్తోంది. కోవిసెల్ఫ్ అనే ఈ కిట్ కేవలం 250 రూపాయలు మాత్రమే. ఈ కిట్ సహాయంతో కరోనా పాజిటివ్ లేదా నెగెటివ్ అనే విషయాన్ని సులభంగా తెలుసుకోవచ్చు. రెండేళ్ల వయస్సు నుంచి 18 ఏళ్ల వయస్సు వారు ఈ కిట్ ఉపయోగించవచ్చు.కేవలం 15 నిమిషాల్లో కరోనా టెస్ట్ చేసుకోవచ్చు. పూణేకు చెందిన మైల్యాబ్ డిస్కవరీ సంస్థ..ఐసీఎంఆర్ (ICMR)సహాయంతో కోవిసెల్ఫ్(Coviself)పేరుతో ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ కిట్లను తయారు చేసింది. ఈ కిట్ల అమ్మకాలకు 2020 నవంబర్ నెలలోనే అమెరికా ఎఫ్‌డీఏ అనుమతులిచ్చింది. కిట్‌లో టెస్ట్‌కార్డ్, ట్యూబ్, డిస్పోజబుల్ బ్యాగ్ ఉంటాయి. ఐసీఎంఆర్ సహకారంతో మార్కెట్‌లో విడుదలైంది. అంటే ఇక కేవలం 250 రూపాయల ఖర్చుతో మీరే స్వయంగా టెస్ట్ చేసుకోవచ్చు.
Also read: PM Modi: ముందుగా Covid-19 Vaccine ఇవ్వండి, తరువాత ఉపన్యాసాలు: Rahul Gandhi
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Coviself Test Kit: ఆన్‌లైన్‌లో టెస్ట్ కిట్లు..ఇక ఇంట్లోనే కరోనా పరీక్షలు