Horoscope Today 21 June 2021: మేష రాశి
మీ విజయవంతమైన అవకాశాలు కనిపిస్తాయి. మీరు చాలాకాలం నుంచి కలుసుకోని వారిని కలవడానికి ఇంట్లో ఏదైనా శుభకార్యం లేదా సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. పనిచేసే చోట ముఖ్యమైన పనిని పూర్తి చేసేటప్పుడు మీరు కొంత విరామం తీసుకుంటారు. ఆస్తికి సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయి. వ్యాపారులకు కలిసొస్తుంది.
వృషభ రాశి
మనసు పెట్టి చేసే పనులకు అధిక పారితోషికం అందుకుంటారు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. అతిగా వ్యవహరించే వ్యక్తులు తమ అపరాదాన్ని తెలుసుకుంటారు. ఉద్యోగాన్ని సరైన విధంగా చేసి ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. వ్యాపారులకు కొంతమేర నష్టాలు గోచరిస్తున్నాయి.
Also Read: Sai Baba madhyana aarati lyrics: షిర్డీ సాయి బాబా మధ్యాహ్న హారతి తెలుగు లిరిక్స్
మిథున రాశి
నేడు మీకు కొంత సమయం మాత్రమే కలిసొస్తుంది. కొందరు వ్యక్తులను విహారయాత్రకు ఆహ్వానించడానికి ఇది మంచి రోజు. కుటుంబంలో కొన్ని విషయాలు చికాకు తెప్పిస్తాయి. డ్రైవింగ్, ప్రయాణాలు లాంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు పని భారం అధికం కానుంది.
కర్కాటక రాశి
స్థిరాస్తుల విషయంలో లాభాలు కలగనున్నాయి. పండితుల లేదా నిపుణుల ముందు మీ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తే ప్రశంసలు పొందుతారు. చాలా కాలం నుంచి వాయిదా పడిన నగదు చేతికి అందుతుంది. ఉద్యోగాలలో కొత్త వ్యక్తులకు మిశ్రమ ఫలితాలు ఎదురుకానున్నాయి.
సింహ రాశి
మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలున్నాయి. వివాహానికి సిద్ధంగా ఉన్నవారికి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం కనిపిస్తోంది. నగదు విషయంలో కొన్ని ఆశ్చర్యకర పరిస్థితులు ఎదుర్కొంటారు. ఇతరుల శ్రేయస్సు గురించి ఆలోచిస్తారు. కెరీర్లో ఒడిదొడుకులు తప్పవు.
కన్య రాశి
ఇంటికి సంబంధించి నెలకొన్న వివాదాలు పరిష్కారమవుతాయి. పని కోసం చేసే ప్రయాణం విజయవంతం కానుంది. శక్తికి మించి చేసే ప్రయత్నాలకు ఫలితం తప్పక ఉంటుంది. చేపట్టిన పనులలో అవాంతరాలు ఎదురవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అధికంగా శ్రమించినా ఉద్యోగులకు, వ్యాపారులకు కష్టానికి తగిన ప్రతిఫలం రాదు.
Also Read: Vinayak Chaturthi 2021: వినాయక చతుర్థి ఇవాళ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు తెలుసా ?
తులా రాశి
కొన్ని ఊహించని సంఘటనలు జరుగుతాయి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. మీ సామర్ధ్యాలు మరోసారి నిరూపించుకుంటారు. గతంలో వదిలేసిన కొన్ని పనులు మరోసారి చేపట్టాలని ఆలోచిస్తారు. మీరు నెంబర్ 1 స్థానాన్ని పొందడానికి మీకు అవకాశం లభిస్తుంది. వ్యాపారాలలో కొన్ని మార్పులు చేస్తారు.
వృశ్చిక రాశి
ఊహించని ఫలితాలు ఎదరవుతున్నా, వెనకడుకు వేయకుండా పట్టుదలగా ఉంటారు. కుటుంబం లేదా సన్నిహితులతో కలిసి విహారయాత్రలను ప్లాన్ చేస్తారు. తిండి విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే అనారోగ్య సమస్యలు. స్థిరంగా రాణించడంతో విజయాలు సాధ్యమవుతాయి.
ధనుస్సు రాశి
కుటుంబంతో కలిసి సరదాగా సమయాన్ని గడుపుతారు. ఆస్తికి సంబంధించిన పేపర్లు ఈ రోజు మీ చేతికి అందుతాయి. నేడు మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. విద్యార్థులు పరీక్షలలో ఉత్తమ ఫలితాల కోసం శ్రమించాలని భావిస్తారు. ప్రతిరోజూ కొంత సమయం శారీరక శ్రమ, వ్యాయామం, ధ్యానం లాంటివి చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది.
మకర రాశి
మీ భుజాలపై కొన్ని బాధ్యతలు తొలగుతాయి. ఒక వ్యక్తి లేదా విషయానికి సంబంధించి కుటుంబంలో ఎవరైనా పొరపాట్లు చేస్తున్నారని మీరు గమనిస్తారు. ప్రేమించే వ్యక్తితో కొంత సమయం సరదాగా గడుపుతారు. కెరీర్లో వృద్ధి సాధిస్తారు. కొన్ని విలువైన వస్తువులు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది.
Also Read: Mrigasira Karthi: మృగశిర కార్తె అంటే ఏమిటి, ఈ సమయంలో చేపలు తినడానికి కారణాలు ఇవే
కుంభ రాశి
ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుంది. ఖర్చులు అధికం కావడంతో కొత్తగా రుణయత్నాలు మొదలుపెడతారు. విద్యార్థులు పోటీ పరీక్షల కోసం మరింత సన్నద్ధం కావాలి. మీ పాత బలహీనత మరోసారి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. మీ ఎత్తుకు సంబంధించిన సమస్యలు ఎదుర్కుంటారు. వ్యాపారులకు ఆశించిన ఫలితాలు అందవు.
మీన రాశి
ఇల్లు లేదా వాహనాలు కొనుగోలు చేయాలని భావించి అందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటారు. దగ్గరగా ఉన్నవారి కోసం ప్రత్యేక ప్రయత్నం చేసినందుకు మీరు చాలా నష్టపరిహారం పొందవచ్చు. విజయాలు సాధించడానికి మంచి సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు. ఉద్యోగులకు కలిసొస్తుంది. కొన్ని శుభవార్తలు చెవిన పడతాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook