Corona Third Wave: కరోనా థర్డ్‌వేవ్ అనివార్యమే..ఎప్పుడో తెలుసా

Corona Third Wave: కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. భయంకరంగా మారి విపత్కర పరిస్థితులు సృష్టించిన కరోనా సెకండ్ వేవ్ నుంచి కోలుకోకముందే థర్డ్‌వేవ్ అనివార్యమనే వార్తలు ఆందోళన కల్గిస్తున్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 19, 2021, 07:10 PM IST
Corona Third Wave: కరోనా థర్డ్‌వేవ్ అనివార్యమే..ఎప్పుడో తెలుసా

Corona Third Wave: కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. భయంకరంగా మారి విపత్కర పరిస్థితులు సృష్టించిన కరోనా సెకండ్ వేవ్ నుంచి కోలుకోకముందే థర్డ్‌వేవ్ అనివార్యమనే వార్తలు ఆందోళన కల్గిస్తున్నాయి.

కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) ధాటికి దేశమంతా విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి. మొదటి వేవ్‌తో పోలిస్తే కరోనా సెకండ్ వేవ్ తీవ్ర భయాందోళనలు రేపింది. ఇప్పుడు దీన్నించి పూర్తిగా కోలుకోకముందే..కరోనా థర్డ్‌వేవ్ ముప్పు భయం గొలుపుతోంది. ముఖ్యంగా కరోనా థర్డ్‌వేవ్ అనివార్యమనే హెచ్చరికలు వస్తున్నాయి. ఎయిమ్స్ (AIIMS) డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కరోనా థర్డ్‌వేవ్ ( Corona Third Wave) అనివార్యమని..6-8 వారాల్లో దేశంలో విరుచుకుపడే అవకాశముందని స్పష్టం చేశారు. అన్‌లాక్‌తో ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించడం లేదని..వైరస్ అంటేనే మ్యూటేషన్‌కు గురవుతుంటుందని తెలిపారు. హాట్ స్పాట్లలో నిఘా అవసరమని చెప్పారు.

దేశంలో ఉన్న జనాభాకు కావల్సిన వ్యాక్సిన్ అందించడం, కోవిషీల్డ్ వ్యాక్సిన్ (Covishield Vaccine) డోసుల మధ్య అంతరం తగ్గించడం సవాలుగా మారిందన్నారు. కరోనా మొదటి, రెండవ వేవ్‌ల నుంచి ఏం గ్రహించామో తెలుసుకుని మసలు కోవాలని సూచించారు. దేశంలో పలు రాష్ట్రాలు అన్‌లాక్ చేయడంతో కోవిడ్ నిబంధనలు పాటించకుండా పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడుతున్నారని తెలిపారు. ఇదే పరిస్థితి కొనసాగితే కరోనా థర్డ్‌వేవ్ ఖాయమని డాక్టర్ గులేరియా (Dr Randeep Guleria)హెచ్చరించారు.

Also read: Cororna Third Wave: కరోనా థర్డ్‌వేవ్ ఇండియాలో ఎప్పుడనే విషయంపై స్పష్టత

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News