AstraZeneca Vaccine: అంతర్జాతీయంగా అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లపై ఆరోపణలు ఎక్కువవుతున్నాయి. వ్యాక్సిన్ సైడ్‌ఎఫెక్ట్స్ ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఓ వ్యక్తి రక్తం గడ్డకట్టి మరణించడంతో వ్యాక్సిన్‌ను ఆ దేశంలో నిలిపివేశారు.
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో వివిధ వ్యాక్సిన్లతో వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతోంది. అదే సమయంలో వ్యాక్సిన్ సైడ్‌ఎఫెక్ట్స్ ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఇటలీలో ఆక్సఫర్డ్ - ఆస్ట్రాజెనెకా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. ఈ తరుణంలో మే 25వ తేదీన ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ (Astrazeneca vaccine) తీసుకున్న 18 ఏళ్ల టీనేజర్ కెమిల్లా కనేపా రక్తం గడ్డకట్టి మరణించాడు. దీంతో ఆక్స్‌ఫర్డ్ - ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను ఇటలీ ప్రభుత్వం నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ముఖ్యంగా 60 ఏళ్ల వయస్సులోపున్నవారికి ఈ వ్యాక్సిన్ ఇకపై ఇవ్వమని ప్రకటించింది. అత్యంత అరుదుగా మాత్రమే సంభవించే రుగ్మత కారణంగా ఆ వ్యక్తి మృతి చెందాడు.
ఇక నుంచి ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను 60 ఏళ్లు పైబడినవారికి మాత్రమే ఇవ్వాలని ఇటలీ (Italy) దేశపు కోవిడ్ 19 కమీషనర్ తెలిపారు. ఆస్ట్రాజెనెకా మొదటి డోసు తీసుకున్న 60 ఏళ్లలోపువారికి రెండవ డోసుగా వేరే వ్యాక్సిన్ ఇవ్వాలని ఇటలీ ప్రభుత్వం తెలిపింది. ఇతర యూరప్ దేశాల మాదిరిగానే ఇటలీ సైతం 60 ఏళ్లలోపు వయస్సున్నవారికి కరోనా వ్యాక్సిన్ నిలిపివేశాయి.
Also read: Hajj 2021: హజ్ యాత్రకు విదేశీయలకు నో ఛాన్స్, 60 వేల మందికే అనుమతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook