Coronavirus Target: కరోనా వైరస్ మహమ్మారి గజగజలాడిస్తోంది. కరోనా సెకండ్ వేవ్‌లో మరణాల రేటు ఆందోళన కల్గిస్తోంది. కోవిడ్ నుంచి కోలుకున్నా సరే ప్రాణాలకు ముప్పుంటోంది. వైరస్ ప్రధానంగా మనిషి శరీరంలోని ఆ శరీర భాగాల్నే టార్గెట్ చేసింది.
కరోనా మహమ్మారి (Corona Pandemic) ప్రాణాలు తీస్తోంది. కోవిడ్ నుంచి కోలుకున్నా ప్రాణాలు ముప్పు ఉంటోంది. ముఖ్యంగా వైరస్ టార్గెట్ చేసేది ఆ శరీర భాగాల్నేనని పరిశోధకులు చెబుతున్నారు. వైరస్ వల్ల చనిపోతున్నవారిలో ఎక్కువమందికి ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకుతుంది. వైరస్ బారినపడి కోలుకున్న తర్వాత కూడా 3 నెలల వరకూ ఊపిరితిత్తులు దెబ్బతినే ఉంటాయని యూకేలోని షెఫీల్డ్ యూనివర్శిటీ, ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ(Oxford Unversity) పరిశోధనల్లో తేలింది.
కొన్ని ప్రత్యేక కేసుల్లో అయితే ఈ ప్రభావం 9 నెలల వరకూ కూడా ఉండవచ్చని పరిశోధనల్లో వెల్లడైంది. కరోనా నుంచి కోలుకున్న తరువాత లంగ్స్(Lungs) సాధారణ స్థితికి చేరుకోవాలంటే 3 నెలలకు పైనే పడుతుందని పరిశోధకులు అంటున్నారు. అప్పటివరకూ జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. కరోనా అనంతరం ఊపిరితిత్తులకైన నష్టాన్ని సాధారణ సిటీ స్కాన్, క్లినికల్ పరీక్షల ద్వారా గుర్తించలేమంటున్నారు. దీనికోసం ఇమేజింగ్ అనే ఆధునిక విధానాన్ని ఉపయోగించారు. అందుకే కోవిడ్ బారినపడి ఇంట్లోనే చికిత్స తీసుకున్నవారిలో దీర్ఘకాలం పాటు శ్వాస సమస్యలుంటే..సంబంధిత వ్యక్తి ఊపిరితిత్తులు ఇంకా రికవర్ కాలేదనే భావించాలని పరిశోధకులు తెలిపారు. హైపర్ పోలరైజ్డ్ జినాన్ ఎంఆర్ఐ పరీక్ష ద్వారానే ఊపిరితిత్తుల్లో అపసవ్యతల్ని తెలుసుకోవచ్చంటున్నారు.
Also read: India Corona Cases: కరోనా వ్యాక్సినేషన్‌లో మరో మైలురాయి, తాజాగా 2 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook