Vizag Steel Plant: ఆంధ్రుల హక్కు - విశాఖ ఉక్కు నినాదంతో ప్రారంభమైన వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ఇప్పుడు ప్రాణవాయువు అందిస్తోంది. లాభసాటిగా లేదు..ప్రైవేటుపరం చేద్దామనుకున్న పరిశ్రమే ఇప్పుుడు ప్రాణవాయుువు సరఫరా చేస్తోంది. వైజాగ్ స్టీల్‌ప్లాంట్ నుంచి నిరంతరాయంగా ఆక్సిజన్ ఉత్పత్తి అవుతోంది.
కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave) విజృంభణకు ముందు..తరువాత విశాఖ స్టీల్‌ప్లాంట్ ఓ చర్చనీయాంశమైంది. సెకండ్ వేవ్ ఉధృతికి ముందు విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు అఖిలపక్షం, కార్మికులు, ఉద్యోగులు రోడెక్కారు. ఆందోళన ప్రారంభమైంది. ఏపీ ప్రభుత్వం సహా అందరూ వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌పై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా గళమెత్తారు. లాభసాటిగా లేదు ప్రైవేటుపరం చేద్దామన్న నిర్ణయం నుంచి కేంద్రం వెనక్కి తగ్గలేదు. అదే సమయంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి ప్రారంభమైంది. రోజురోజుకూ పెద్దఎత్తున కేసులు నమోదు కావడంతో దేశంలోని చాలా ప్రాంతాల్లో ఆక్సిజన్ కొరత తీవ్రమైంది. సరిగ్గా అదే సమయంలో వైజాగ్ స్టీల్‌ప్లాంట్(Vizag Steel plant) మరోసారి చర్చనీయాంశమై..వార్తల్లోకొచ్చింది.
కరోనా బాధితుల చికిత్స కోసం విశాఖ స్టీల్‌ప్లాంట్ ఆక్సిజన్ ఉత్పత్తికి నడుం బిగించింది. ప్లాంట్ నుంచి లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి ప్రారంభించి నిరంతరాయంగా సరఫరా కొనసాగించింది. ఏ ప్లాంట్‌ను ప్రైవేటుపరం (Vizag Steel plant privatisation) చేద్దామని కేంద్ర ప్రభుత్వం (Central government) నిర్ణయించిందో అదే పరిశ్రమ దేశానికి ప్రాణవాయువు అందించడం ప్రారంభించింది. గత 24 గంటల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు 150 టన్నులు, కర్నాటకకు 30 టన్నుల ఆక్సిజన్ సరఫరా చేసింది. కరోనా విజృంభణ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆక్సిజన్‌కు విపరీతమైన డిమాండ్ ఏర్పడటంతో ఆక్సిజన్ ఉత్పత్తికి ఈ పరిశ్రమ ముందుకొచ్చింది. స్టీల్‌ప్లాంట్ ఉత్పత్తి ప్రక్రియలో తయారయ్యే లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌ను పలు రాష్ట్రాలకు సరఫరా చేస్తోంది. గత ఏడాదిలో వచ్చిన కరోనా మొదటి దశలో కూడా విశాఖ స్టీల్‌ప్లాంట్ లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌ను ( Oxygen Production) సరఫరా చేసింది. ప్రస్తుత రెండో దశలో గత నెల 13వ తేదీ నుంచి ఇప్పటివరకు 4 వేల 800 టన్నుల ఆక్సిజన్‌ను సరఫరా చేసింది. గత ఏడాది నుంచి ఇప్పటివరకు మొత్తం 13 వేల 650 టన్నుల ఆక్సిజన్‌ను స్టీల్‌ప్లాంట్ సరఫరా చేసింది.
Also read: COVID-19 in AP: ఏపీలో 24 గంటల్లో కరోనాతో 98 మంది మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook