Dead Bodies In Rivers: కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న వేళ గంగా నదిలో భారీ సంఖ్యలో మృతదేహాలు తెలియాడుతూ కనిపించడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలను గంగా, యుమునా నదిలో పడవేయడంతో ప్రజలలో భయాందోళన వ్యక్తమవుతోంది. అయితే నీటితో కరోనా బాధితుల మృతదేహాలు దొరికినా, ఇలాంటి ఘటనలో వైరస్ సంక్రమణపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.
గంగా మరియు యమునా నదులు పరివాహక ప్రాంతాలలో పలు గ్రామాలకు జీవనాధారంగా ఉన్నాయి. తాగునీటి అవసరాలను తీరుస్తున్న నదులలో శవాలు కనిపించడం స్థానిక ప్రజలను భయాందోళనకు గురిచేసింది. దీనిపై నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ స్పష్టత ఇచ్చారు. నీళ్ల ద్వారా కరోనా వైరస్(CoronaVirus) అంతగా వ్యాపించదని, ఆందోళన అక్కర్లేదని చెప్పారు. నీళ్ల ద్వారా కరోనా ఇతరులకు సోకుతున్నట్లుగా ఎక్కడా ఎలాంటి ఘటనలు చోటుచేసుకోలేదని సైంటిఫిక్ అడ్వైజర్ కె విజయ్‌రాఘవన్ సైతం తెలిపారు. అయితే కరోనా సోకిన వ్యక్తి డ్రాప్‌లెట్స్ నీళ్లపై పడితే అక్కడే ఉన్న మరో వ్యక్తి నీటిని తాకిన సందర్భాలలో మాత్రమే కరోనా సోకే అవకాశం ఉందన్నారు.
Also Read: Income Tax Benefits: ఇన్‌కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ కావాలా, అయితే ఈ స్కీమ్‌లో చేరండి
నీటిలో చేరగానే కరోనా వైరస్ బలహీనపడుతుందని, మనుషులకు సంక్రమించే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని ఐఐటీ కాన్పూర్‌కు చెందిన ప్రొఫెసర్ సైతం తెలిపారు. నీరు ప్రవహిస్తుంటుందని, దానిపై ఆందోళన చెందకూడదని గంగా, యమునా పరివాహక ప్రాంతాల ప్రజలకు ధైర్యం చెప్పారు. బిహార్ ప్రభుత్వం ఇప్పటివరకూ బక్సార్ జిల్లాలో గంగా నదిలో 71 వరకు మృతదేహాలను వెలికితీసింది. దేశ వ్యాప్తంగా కరోనా వేరియంట్లపై ఆందోళన వ్యక్తమవుతుంటే నదులలో శవాలు కనిపించడం మరో సమస్యగా మారింది.
Also Read: Google Pay users కి గుడ్ న్యూస్.. అమెరికా నుంచి భారత్‌కి ఇక ఈజీగా మనీ ట్రాన్స్‌ఫర్
మరోవైపు ఉత్తరప్రదేశ్ నారాహి ప్రాంతంలో మూడు ఘాట్లలో కనీసం 45 COVID-19 మృతదేహాలను చూసినట్లు బలియా ప్రాంతవాసులు చెబుతున్నారు. నదులలో మృతదేహాలు, అందులోనూ కరోనా వ్యాప్తి సమయం కావడంతో అధికారులను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. గంగా, యుమనా పరివాహక ప్రాంతాలలో మృతదేహాలు పడవేయకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Dead Bodies In Ganga: నదిలో COVID-19 మృతదేహాలు, వైరస్ వ్యాప్తిపై నిపుణులు ఏమన్నారంటే