Oxygen Plants Construction: కరోనా మహమ్మారి ఉధృతి నేపధ్యంలో ఇప్పుడు అందరికీ అత్యవసరమైంది ఆక్సిజన్. ఏపీ ప్రభుత్వంలో యుద్ధ ప్రాతిపదికన పెద్దఎత్తున ఆక్సిజన్ ప్లాంట్లు నిర్మాణం కానున్నాయి. ఇప్పటికే నాలుగు ప్లాంట్ల నిర్మాణం ప్రారంభమైంది.
దేశంలో కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave) ధాటికి జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఆక్సిజన్ కొరత దేశంలో తీవ్రంగా ఉంది. చాలామంది ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ తరుణంలో యుద్ధప్రాతిపదికన ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణం (Oxygen plants construction) చాలా అవసరంగా మారింది. ఏపీ(AP)లో అదే జరుగుతోంది. రాష్ట్రంలో 49 ప్రాంతాల్లో ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణం, 50 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్ల కొనుగోలు, ఆక్సిజన్ పైప్లైన్ల ఏర్పాటు కోసం ఏపీ ప్రభుత్వం ( Ap government) 3 వందల కోట్ల రూపాయల్ని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
మరోవైపు నేషనల్ హైవే అథారిటీ (NHAI) సైతం ఏపీలో 42 ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణ పనుల్ని( Oxygen plants construction works) ప్రారంభించింది. తొలి విడతలో భాగంగా రాష్ట్రంలో 4 ప్లాంట్ల నిర్మాణాన్ని చేపట్టింది. హిందూపురంలో 1000 ఎల్పీఎం సామర్ధ్యం, అమలాపురంలో 5 వందల ఎల్పీఎం సామర్ధ్యం, మదనపల్లెలో 5 వందల ఎల్పీఎం సామర్ధ్యం, తాడేపల్లిగూడెంలో 1000 ఎల్పీఎం సామర్ధ్యంతో ప్లాంట్ల నిర్మాణం ప్రారంభమైంది. మిగిలిన 38 ప్లాంట్ల ఏర్పాటుకు స్థలాలు ఖరారయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన ఆసుపత్రుల వద్ద ప్లాంట్ల నిర్మాణం జరగనుంది.
Also read: Oxygen plants: ఏపీలో భారీగా ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు, 3 వందల కోట్లు కేటాయించిన ప్రభుత్వం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook