దాదాపు నాలుగు వారాలపాటు ఏ సమస్యలు లేకుండా కొనసాగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రస్తుతం కరోనా కేసులతో నిండిపోయింది. పలు ఫ్రాంచైజీల ఆటగాళ్లు, కోచ్‌లు, సహాయక సిబ్బంది కరోనా బారిన పడుతుండటంతో ఐపీఎల్ 2021ను బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేయడం తెలిసిందే. ఐపీఎల్ మిగతా మ్యాచ్‌లు ఎప్పుడు ప్రారంభం అవుతాయా అనే ఆసక్తి క్రికెట్ ప్రేమికులలో నెలకొంది.
తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్ మైఖేల్ హస్సీకి కరోనా సోకింది. బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీకి సోమవారం కరోనా పరీక్షలలో పాజిటివ్‌గా తేలగా, తాజాగా నిర్వహించిన కోవిడ్19 పరీక్షలలో బ్యాటింగ్ కోచ్ హస్సీకి కరోనా సోకినట్లు తేలింది. అయితే మరోసారి టెస్టులు నిర్వహించిన తరువాత అధికారికంగా ప్రకటించేందుకు సీఎస్కే ఫ్రాంచైజీ, మేనేజ్మెంట్ ఎదురుచూస్తోంది. బౌలింగ్ కోచ్ బాలాజీకి పాజిటివ్‌గా తేలడంతో ఆటగాళ్లు అతడికి దూరంగా ఉన్నారు. బాలాజీ ఐసోలేషన్‌లో చికిత్స పొందుతుండగా, బ్యాటింగ్ కోచ్ మైఖేల్ హస్సీ సైతం కరోనా బారిన పడటంతో CSK ఫ్రాంచైజీలో ఆందోళన మొదలైంది.
Also Read: IPL 2021 Suspended: ఆటగాళ్లకు కరోనా, ఐపీఎల్ నిరవధిక వాయిదా వేసిన BCCI
కేకేఆర్ జట్టులో మొదలైన కరోనా కలకలం దాదాపు నాలుగైదు ఫ్రాంచైజీలను ఆందోళనకు గురిచేస్తోంది. ఐపీఎల్ 2021(IPL 2021) ఆరంభంలో ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు, ముంబై మైదాన సిబ్బందిలో కొందరికి కరోనా సోకగా వారు వెంటనే కోలుకున్నారు. ఆపై ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు అక్షర్ పటేల్ సైతం కరోనా నుంచి కోలుకుని సీజన్ ప్రారంభించాడు. కానీ సీజన్ మధ్యలో కరోనా కేసులు రావడం ఆటగాళ్ల ఆరోగ్యంపై ఆందోళన పెంచుతోంది. ఈ క్రమంలో మంగళవారం నాడు బీసీసీఐ ఈ టీ20 టోర్నీని నిరవధికంగా వాయిదా వేయడం తెలిసిందే.
Also Read: IPL 2021: సందీప్ వారియర్ పర్లేదు, కానీ వరుణ్ చక్రవర్తిలో కరోనా లక్షణాలు
కరోనా కేసులు రావడంతో స్వదేశానికి ప్రయాణం కావాలని విదేశీ ఆటగాళ్లు భావిస్తున్నారు. బీసీసీఐ అనుమతి కోసం వారు ఎదురుచూస్తున్నట్లు సమాచారం. మరోవైపు భారత ఆటగాళ్లు సైతం బీసీసీఐ, ఐపీఎల్ బోర్డు అనుమతి లభిస్తే తమ ఇంటికి వెళ్లిపోయేందుకు సిద్ధంగా ఉన్నారు. కరోనా కేసులు ఇదే విధంగా కొనసాగితే విదేశాలలో ఐపీఎల్ 2021 మిగతా మ్యాచ్‌లు నిర్వహించాల్సి ఉంటుందని సీనియర్ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook