న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ (Prakash Jawadekar) కరోనాబారిన పడినట్టు వచ్చిన వార్తల నుంచి ఇంకా తేరుకోకముందే.. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడలు శాఖ మంత్రి కిరణ్ రిజిజుకు (Kiren Rijiju) జరిపిన కొవిడ్-19 పరీక్షల్లో కరోనావైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు... ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని, వైద్యుల సలహా మేరకు అవసరమైన చికిత్స తీసుకుంటున్నానని తన ట్వీట్లో పేర్కొన్నారు. ఇటీవల తనతో టచ్‌లోకి వచ్చిన వారు కూడా కరోనావైరస్ పరీక్షలు చేయించుకుని ఎవరికి వారే క్వారంటైన్ కావాల్సిందిగా కేంద్ర మంత్రి ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేశారు.
Also read : Shortage of oxygen, Remdesivir and ICU beds: ఢిల్లీలో మళ్లీ Lockdown విధిస్తారా ? అనుమానాలకు తావిచ్చిన CM Arvind Kejriwal ప్రకటన!
ఉత్తరాఖండ్‌లోని తెహ్రీలో శుక్రవారం జరిగిన వాటర్‌స్పోర్ట్స్ అండ్ అడ్వెంచర్ ఇనిస్టిట్యూట్ (Water Sports and Adventure Institute in Tehri) ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju) పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయనకు సమీపంగా వెళ్లిన నేతలు, అధికారులు కూడా అప్రమత్తం కావాల్సిన అవసరం ఏర్పడింది.
Also read : COVID-19 vaccine తొలి డోస్ తీసుకున్న తర్వాత కరోనా బారినపడిన Sonu Sood
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook