Tirupati Bypoll: తిరుపతి ఉప ఎన్నికలపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. తిరుపతి ఎన్నికల్లో కార్యాచరణపై నేతలు, మంత్రులకు దిశానిర్దేశం చేశారు. మెజార్టీ మొత్తం దేశానికే ఓ సందేశం కావాలన్నారు.
దేశంలో జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలతో ( Five state Assembly elections) పాటు తెలుగు రాష్ట్రాల్లోని రెండు ఖాళీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి లోక్‌సభ, తెలంగాణలోని నాగార్జున సాగర్ అసెంబ్లీకు ఉప ఎన్నికలు ఏప్రిల్ 17వ తేదీన నిర్వహించనున్నారు. ఈ నేపధ్యంలో అందరి దృష్టీ తిరుపతి ఉప ఎన్నిక(Tirupati Bypoll)పై పడింది. అందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుపతి ఉప ఎన్నికపై దృష్టి పెట్టారు. దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా తిరుపతి ఉప ఎన్నిక ఫలితాలుండాలని వైఎస్ జగన్ (Ap cm ys jagan) పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇందుకు తగ్గట్టుగా కార్యాచరణ ఉండాలన్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకూ చేసిన అభివృద్ధి , సంక్షేమాన్ని ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లాలని కోరారు. దేవుని దయ వల్ల స్థానిక సంస్థల్లో మంచి ఫలితాలు వచ్చాయని సంతోషం వ్యక్తం చేశారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ( Ysr congress party) తిరుపతి అభ్యర్ధి డాక్టర్ ఎం గురుమూర్తి(Dr M Gurumurthy)ని పార్టీ నేతలకు పరిచయం చేశారు. ప్రతి నియోజకవర్గానికి ఒక మంత్రి ఇన్‌ఛార్జ్‌గా, అదనంగా ఒక ఎమ్మెల్యే ఉంటారన్నారు. పార్లమెంట్ పరిధిలోని ప్రతి గడపకూ వెళ్లి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని వివరించాలన్నారు. రానున్న రోజుల్లో కూడా ఇదే కొనసాగుతుందనే సందేశం ప్రజల్లో బలంగా తీసుకెళ్లాలన్నారు. మహిళా సాధికారత, మహిళలకు ఈ ప్రభుత్వంలో జరిగిన మేలును ప్రజలకు వివరించాలన్నారు. అతి విశ్వాసం వద్దని..అందరూ సమన్వయంతో పనిచేసి గురుమూర్తిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, పేర్ని వెంకట్రామయ్య, కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, ఆదిమూలపు సురేశ్, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి తదితరులు సమీక్షలో పాల్గొన్నారు.
Also read: Election Code In AP: ఏపీలో ఎలక్షన్ కోడ్ ఎత్తివేసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook