ఏపీలో బడ్జెట్ ఫీవర్: కేంద్రంపై టీడీపీ ఫైర్

బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి కేటాయింపుల నిమిత్తం ఎలాంటి ప్రకటనలు చేయకపోవడాన్ని తప్పుపడుతూ పలువురు టీడీపీ నాయకులు మోడీ సర్కార్ పై ఫైర్ అయ్యారు.

Last Updated : Feb 2, 2018, 02:20 PM IST
ఏపీలో బడ్జెట్ ఫీవర్: కేంద్రంపై టీడీపీ ఫైర్

బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి కేటాయింపుల నిమిత్తం ఎలాంటి ప్రకటనలు చేయకపోవడాన్ని తప్పుపడుతూ పలువురు టీడీపీ నాయకులు మోడీ సర్కార్ పై ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తేల్చుకోవడానికి ఆదివారం సర్వసభ్యసమావేశం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ మాట్లాడుతూ.. ఇలాగే పరిస్థితి కొనసాగితే టీడీపీ, బీజేపీ కూటమి బ్రేక్ అయినా ఆశ్చర్యపోవాల్సింది లేదని తెలిపారు.

ఈ నేపథ్యంలో ఆయన తన అభిప్రాయాలు పంచుకున్నారు. టీడీపీ మూడు నిర్ణయాల్లో ఏదో ఒకటి తీసుకోవాలని ఆయన తెలిపారు. మొదటిది కేంద్రాన్ని సాధ్యమైనంత వరకు బతిమాలి ఒప్పించే ప్రయత్నం చేయడం. రెండవది టీడీపీ ఎంపీలు అందరూ రిజైన్ చేయడం లేదా మూడవది పొత్తును విరమించుకోవడం ఒక్కటే దీనికి పరిష్కారం అని ఆయన అభిప్రాయపడ్డారు.

గురువారం టీడీపీ ఎంపీ సుజనా చౌదరి బడ్జెట్ విషయంలో జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ.. కేంద్రంపై మండిపడిన తర్వాత తాజాగా టీజీ వెంకటేష్ ఈ విషయంపై స్పందించారు. ఇప్పటికే కేంద్రమంత్రిగా ఉన్న సుజనా చౌదరి ఈ వ్యాఖ్యలు చేయడం రాష్ట్రంతో పాటు కేంద్రంలో కూడా దుమారం రేపాయి. ముఖ్యంగా రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్టుకి నిధులు, అమరావతికి ఇవ్వాల్సిన ఫండింగ్ లాంటి విషయాలపై ఎలాంటి ప్రకటనలను కేంద్రం విడుదల చేయకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు.

అలాగే మరో టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. ఎన్నోసార్లు చంద్రబాబు ఢిల్లీ వెళ్లి అరుణ్ జైట్లీతో మాట్లాడారని.. ఆయన చంద్రబాబు పేరును బడ్జెట్‌లో ఒక్కసారి కూడా ప్రస్తావించకపోవడం దారుణమని తెలిపారు. గత వారమే వీలైతే బీజేపీతో తెగదింపులు చేసుకుంటామని చంద్రబాబు స్వయంగా చెప్పిన క్రమంలో ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు అన్నీ ఆసక్తి రేపుతున్నాయి. 2014లో స్పెషల్ స్టేటస్ కోసం ఏపీ ప్రభుత్వం చేసిన సిఫార్సును కేంద్రం వెనక్కి తిప్పి పంపించేసిన సంగతి తెలిసిందే

Trending News