Petrol Price Today: నేడు పెట్రోల్‌పై 30 పైసలు, Diesel Price 35 పైసలు పెరిగింది, మెట్రో నగరాలలో లేటెస్ట్ రేట్స్

Petrol Price Today: ముఖ్యంగా గతేడాది నుంచి వాహనదారుల జేబులు గుల్ల అవుతున్నాయి. తాజాగా ఫిబ్రవరి 16 (మంగళవారం) నాడు లీటర్‌ పెట్రోల్‌ ధర 30 పైసలు, డీజిల్ ధర 35 పెసలు చొప్పున పెరిగింది.

Written by - Shankar Dukanam | Last Updated : Feb 16, 2021, 10:44 AM IST
  • భారత్‌లో చమురు ధరలు రోజురోజుకూ విపరీతంగా పెరిగిపోతున్నాయి
  • లీటర్‌ పెట్రోల్‌ ధర 30 పైసలు, డీజిల్ ధర 35 పెసలు చొప్పున పెరిగింది
  • మంగళవారం నాడు ఆల్‌టైమ్ కొత్త గరిష్ఠానికి పెట్రోలు, డీజిల్ ధరలు
Petrol Price Today: నేడు పెట్రోల్‌పై 30 పైసలు, Diesel Price 35 పైసలు పెరిగింది, మెట్రో నగరాలలో లేటెస్ట్ రేట్స్

Petrol Price Today In Hyderabad 16 February 2021: భారత్‌లో చమురు ధరలు రోజురోజుకూ భారీగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా గతేడాది నుంచి వాహనదారుల జేబులు గుల్ల అవుతున్నాయి. తాజాగా ఫిబ్రవరి 16 (మంగళవారం) నాడు లీటర్‌ పెట్రోల్‌ ధర 30 పైసలు, డీజిల్ ధర 35 పెసలు చొప్పున పెరిగింది. తాజాగా పెరిగిన ధరలతో మంగళవారం నాడు ఆల్‌టైమ్ కొత్త గరిష్ఠానికి పెట్రోలు, డీజిల్ ధరలు చేరుకున్నాయి.

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ ప్రకారం తాజాగా పెరిగిన ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌(Hyderabad)లో మంగళవారం ఉదయం పెట్రోల్ ధర లీటర్‌కు రూ.92.84, డీజిల్ ధర రూ.86.93కు చేరుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరులోనూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. గుంటూరులో పెట్రోల్ ధర రూ.95.40, డీజిల్ ధర లీటర్‌పై రూ.88.97 అయింది.

Also Read: Gold Price Today: బులియన్ మార్కెట్‌లో నేటి బంగారం ధరలు, పెరుగుతున్న Silver Price

దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.89.29, డీజిల్ ధర రూ.79.70కు పెరిగింది. పెట్రోల్ ధరలు చెన్నైలో రూ.91.45, కోల్‌కతాలో రూ.90.54, ముంబైలో గరిష్టంగా రూ.95.75కి చేరింది.

ఇక డీజిల్‌ ధర లీటర్‌పై ఢిల్లీ(Fuel Prices In Delhi)లో రూ.79.70కు చేరగా, హైదరాబాద్‌లో రూ.86.93 అయింది. ముంబైలో రూ.86.72, చెన్నైలో రూ.84.77, కోల్‌కతాలో రూ.83.29కు అయింది.

Also Read: Cheapest Recharge Plans: రూ.100 కన్నా తక్కువ ధరలో బెస్ట్ రీఛార్జ్ ప్లాన్ అందిస్తున్న ఎయిర్‌టెల్, జియో మరియు Vi

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News