Corona Vaccine: కరోనా వ్యాక్సిన్ తీసుకున్న Asha Worker మృతి, బంధువుల ఆందోళన

Asha Worker Dies After Corona Vaccination | కరోనా మహమ్మారిని అరికట్టేందుకు దేశ వ్యాప్తంగా తొలి దశలో కరోనా టీకాలు విజయవంతంగా ఇస్తున్నారు. అయితే టీకా తీసుకున్న కొందరు వాలంటీర్లు, ఆరోగ్య సిబ్బంది, ఆశా వర్కర్లు ప్రాణాలు కోల్పోవడం ఆందోలన రేకెత్తిస్తోంది.

Written by - Shankar Dukanam | Last Updated : Jan 24, 2021, 12:25 PM IST
  • దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఇస్తున్న కరోనా టీకాలు
  • కరోనా వ్యాక్సినేషన్ క్రమంలో గుంటూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది
  • కోవిడ్-19 టీకా తీసుకున్న ఆశా వర్కర్ అనారోగ్యంతో మృతి చెందారు
Corona Vaccine: కరోనా వ్యాక్సిన్ తీసుకున్న Asha Worker మృతి, బంధువుల ఆందోళన

Asha Worker Dies After Corona Vaccination in Guntur: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఇస్తున్న కరోనా టీకాల ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోంది. అదే సమయంలో కోవిడ్-19 టీకాల మీద రోజురోజుకూ అనుమానాలు, భయాందోళన సైతం పెరిగిపోతోంది. 

ఎక్కడో ఓ చోట వ్యాక్సిన్ తీసుకున్న వాలంటీర్లు, ఆరోగ్య సిబ్బంది ప్రాణాలు కోల్పోవడమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో గుంటూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.  గుంటూరు జీజీహెచ్‌లో ఆశా వర్కర్ విజయలక్ష్మి మృతిచెందారు. జనవరి 19న కరోనా విజయలక్ష్మి కరోనా వ్యాక్సిన్(Corona Vaccine Latest News) తీసుకున్నారు.

Also Read: Aarogyasri Card: కేవలం 8 గంటల్లోనే ఆరోగ్యశ్రీ కార్డు జారీతో ఉద్యోగులు రికార్డు

కోవిడ్-19 టీకా తీసుకున్న తొలి 48 గంటల వరకు ఆశా వర్కర్ విజయలక్ష్మి బాగానే ఉన్నారు. అనంతరం ఆమె అస్వస్థతకు గురయ్యారని బంధువులు తెలిపారు. ఈ క్రమంలో జనవరి 21న చలి జ్వరం రావడంతో గుంటూరు(Guntur District) ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతూ ఆశా వర్కర్ మృతి చెందారు.

Also Read: EPF Wage Ceiling: ఈపీఎఫ్ పరిమితి రూ.15,000 నుంచి రూ.21,000కు పెంచే యోచనలో ప్రభుత్వం

కాగా, కరోనా వ్యాక్సిన్ తీసుకోవడంలో ప్రాణాలు కోల్పోయిన ఆశా వర్కర్ విజయలక్ష్మి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గుంటూరు జీజీహెచ్ ఎదుట తోటి ఆశావర్కర్లు(Asha Workers News Updates) ఆందోళనకు దిగారు. విజయలక్ష్మి కుటుంబానికి రూ.50 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని, వారికి ఇంటి స్థలంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News