"ఎన్టీఆర్ జీవిత చరిత్ర సినిమాలో నన్ను హీరోగా చేయమని రాంగోపాల్ వర్మ అడగడం సంతోషం, నేను హీరోగా చేయాలంటే హీరోయిన్గా లక్ష్మీ పార్వతిని మార్చాలి" అన్న సోమిరెడ్డి మాటలకు వర్మ స్పందించారు."సార్.. మీరు హీరోయిన్గా లక్ష్మి పార్వతి గారిని వద్దు అని చెప్పినప్పట్నుంచి దీపికా పాడుకొనే నుండి మీ అగ్రికల్చర్ పొలాలలో పని చేసే స్త్రీ కూలీలదాకా అందర్నీ అడిగి చూసా. వాళ్ళ రిప్లైలు వింటే మీరు ఉరేసుకుంటారు. కాబట్టి మానవతా దృక్పధం కన్నా మీ భార్య గారి మీద గౌరవంతో వాళ్ళు మీ పైన వ్యక్తపరిచిన అభిప్రాయాలు అన్నింటిని నా మనసులోనే అతి భద్రంగా దాచిపెడ్తున్నా" అని కౌంటర్ ఇచ్చారు.