Mock Egg: గుడ్డు శాఖాహారమా.. లేదా మాంసాహారమా? గూగుల్ చేసినా ఈ డౌట్ మాత్రం క్లియర్ అవదు. అయితే ఇప్పుడు మీరు చదవబోయేది మాత్రం ప్యూర్ వెజిటేరియన్ గుడ్డు గురించి. నిస్సందేహంగా దీన్ని శాఖాహారులు హ్యాప్పీగా తినేయోచ్చు.ఇక నూటికి నూరు శాతం వెజిటేరియన్ ఎగ్గు గురించి తెలుసుకుందాం..
ALSO READ| Health Tips : ఈ సమస్యలు ఉన్న వాళ్లు పసుపు పాలు తాగడం మంచిది కాదు
ఈ గుడ్డును ఢిల్లీ (Delhi) ఐఐటీ విద్యార్థులు తయారు చేశారు. ఈ వెజిటేరియన్ గుడ్డు మనిషికి కావాల్సిన పోషకాలు, ప్రొటీన్లను కలిగి ఉంటుంది. అదే సమయంలో ఆరోగ్య నియమాలకు అనుగుణంగా అన్ని ప్రామాణికాలు కలిగి ఉంటుంది.
ఈ గుడ్డు (Egg) తినడానికి సాధారణ గుడ్డుకంటే రుచికరంగా ఉంటుంది. కోడి గుడ్డుకన్నా ఎక్కువ పోషకాలు, శాఖాహార గుణాలు కలిగి ఉంటుంది. ఈ ఆవిష్కరణకు ఢిల్లీ ఐఐటీ విద్యార్థి ఇప్పటికే పలు అవార్డులు సొంతం చేసుకున్నాడు. జర్మనీకి చెందిన నిపుణుడు క్రిస్టియ్ ఐఐటీ విద్యార్ధికి అవార్డుతో పాటు 5000 అమెరికన్ డాలర్ల బహుమతిని అందించారు.
ALSO READ| Chyavanprash: చ్యవన్ ప్రాష్ వల్ల ఇమ్యూనిటీ పెరగుతుంది..ఇన్ఫెక్షన్స్ దరి చేరవు
ఈ కొత్తరకం గుడ్డును మాక్ ఎగ్ అని పేరుతో పిలుస్తారు అని..ఈ నకిలీ గుడ్డును శాఖాహారులు ఎలాంటి డౌట్ లేకుండా తినవచ్చు అని తెలిపారు. మాక్ ఎగ్ తినడం వల్ల ఆరోగ్యం మెరుగు అవడమే కాదు.. ఆకలి కూడా పెరుగుతుంది అని దీన్ని తయారు చేసిన విద్యార్థి తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe