Telangana: 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి రైతులకు కనిష్ట మద్దతు ధర అందించడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి సుమారు రూ.7500 కోట్ల మేరా నష్టం ఏర్పడినట్టు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఇందులో కేవలం వరి కొనుగోలు వల్లే సుమారు రూ.3,935 కోట్ల మేరా నష్టం వాటల్లినట్టు తెలిపింది ప్రభుత్వం.
Also Read | ఈ కొత్త ATM,Banking రూల్స్ తెలియపోతే ఇబ్బంది పడతారు వెంటనే చదవండి
తెలంగాణ (Telangana) ప్రభుత్వం ఆదివారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో వివిధ పంటల కొనుగోలు, వ్యవసాయ విధానాల సంస్కరణ, మార్కెట్లలో వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకం, రైతు బంధు (Rythu Bandhu) సమితీల బాధ్యత వంటి అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
Also Read | Rythu Bandhu: త్వరలో మరో విడత రైతు బంధు ప్రారంభం
దాంతో పాటు రైతులకు అవసరం అయిన విత్తనాలు, ఎరువులు అందుబాటులోకి తీసుకురావడం, దాంతో పాటు, అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందుబాటులో ఉంచడం వంటి అంశాలపై చర్చించారు.
వరి కొనుగోలు వల్ల తెలంగాణ ప్రభుత్వానికి రూ.3,935 కోట్లు నష్టం జరిగింది అని తెలిపింది. అదే సమయంలో మొక్కజొన్నల కొనుగోలు చేయడం వల్ల రూ.1.547.59 కోట్లు, జొన్నల కొనుగోలు వల్ల రూ.52.78 కోట్లు, కందుల వల్ల రూ.52.47 కోట్లు, శనగల కొనుగోలు వల్ల రూ.14.25 కోట్లు నష్టపోయింది అని తెలిపింది ప్రభుత్వం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe