Rajinikanth discharged from hospital: సూపర్‌స్టార్ రజనీకాంత్ అస్వస్థతకు గురై రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఆరోగ్య పరిస్థితి కుదుటపడటంతో ఈ రోజు అపోలో వైద్యులు (Rajinikanth hospitalised) డిశ్చార్జ్ చేశారు. దీంతో మరికాసేపట్లో రజనీకాంత్ చెన్నై వెళ్లనున్నారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడిందని.. బీపీ కూడా అదుపులోకి వచ్చిందని (Rajinikanth health conidtion) అపోలో వైద్యులు ప్రకటించారు. అయితే వారంపాటు రెస్ట్ తీసుకోవాలని అపోలో వైద్యులు రజనీకి సూచించారు. Also Read: Rajinikanth: రజినీకాంత్‌కు అస్వస్థత, అపోలో ఆసుపత్రిలో చేరిక
In view of his improved medical condition, Rajinikanth is being discharged from the hospital today. His blood pressure has been stabilized and he is feeling much better: Apollo Hospital, Hyderabad pic.twitter.com/kbN5vg7g1r
— ANI (@ANI) December 27, 2020
అయితే రజనీకాంత్ (Rajinikanth) కు నిన్న జరిపిన వైద్య పరీక్షల్లో రిపోర్ట్లన్నీ నార్మల్‌గానే ఉన్నాయని అపోలో వైద్యులు ఉదయం ప్రకటించిన బులెటిన్ (health health bulletin) లో పేర్కొన్నారు. అయితే శుక్రవారం నాడు హై బీపీతో రజనీకాంత్ అపోలో ఆసుపత్రిలో చేరారు. ముందుగా రజనీకాంత్‌కు కరోనా పరీక్షలు నిర్వహించి, ఆ తర్వాత బీపీకి సంబంధించి వైద్యం అందించారు. Also Read: Covid-19: ఇదే చివరి మహమ్మారి కాదు: WHO
ఇదిలాఉంటే.. రజనీకాంత్ డిసెంబరు 31న తన పార్టీ, గుర్తులను ప్రకటిస్తానని వెల్లడించారు. మరికొన్ని రోజుల్లో జరిగే తమిళనాడు అసెంబ్లీ (Tamil Nadu) ఎన్నికల్లో పోటీచేయనున్నట్లు ఇటీవల రజనీకాంత్ వెల్లడించిన సంగతి తెలిసిందే. కావున ఆయన డిశ్చార్జ్ కాగానే చెన్నైకి బయలుదేరి వెళ్లనున్నారు. Also Read: Karnataka: ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు ఢీకొని ఐదుగురి మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook