Solar Eclipse: చివరి సూర్యగ్రహణం రేపే అని తెలుసా మీకు..ఆశ్చర్యపోతున్నారా..చివరిదేంటని. అంటే ఇంకెప్పుడూ సూర్య గ్రహణమే సంభవించదా..ఇదే కదా మీ ప్రశ్న..సమధానమిదిగో..
2020 ఏడాది పూర్తి కావడానికి మరికొద్ది రోజులు మాత్రమే మిగిలింది. మరి చివరి సూర్య గ్రహణం ( Solar Eclipse )చూసేద్దామా. చివరిదంటే ఈ ఏడాదిలో చివరిదని అర్ధం. 2020లో చివరి సూర్య గ్రహణం రేపు అంటే డిసెంబర్ 14న సంభవిస్తోంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటల 3 నిమిషాలకు ప్రారంభమై..డిసెంబర్ 15 ఉదయం 12 గంటల 23 నిమిషాలకు ముగియనుంది. ఈ లెక్కన భారత్ ( India )లో సూర్యాస్తమయం అయిపోతుందప్పటికి. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్నించే సూర్యగ్రహణాన్ని వీక్షించవచ్చు.
సూర్య గ్రహణం రాత్రి 9 గంటల 43 నిమిషాలకు పీక్స్ కు చేరుతుంది. అంటే సూర్యుడిని చంద్రుడు ( Moon )పూర్తిగా కప్పేసే సమయం. పూర్తి సూర్య గ్రహణం చిలీ ( Chile ), అర్జెంటీనా ( Arjentina ) లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కన్పిస్తుంది. పసిఫిక్ మహా సముద్రం, అంటార్కిటికా, దక్షిణ అమెరికాలోని దక్షిణ ప్రాంతాల్లో పాక్షికంగా కన్పిస్తుంది. చిలీలోని శాంటియాగో, బ్రెజిల్ లోని సావోపాలో, అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్, పెరూలోని లిమా, ఉరుగ్వేలోని మాంటెవీడియో, పరాగ్వేలోని అసున్సియన్ ప్రాంతాల్లో కూడా పాక్షికంగా చూడవచ్చు.
అసలు 2020లో రెండు సూర్య గ్రహణాలు సంభవించాయి. మొదటిది జూన్ 21 న సంభవించగా..రెండోది చివరిది డిసెంబర్ 14న ఏర్పడనుంది. మొదటిది ఇండియాలో కన్పించగా..రెండోది మాత్రం కన్పించదు. అయితే నాసా టెలివిజన్ మొత్తం సూర్య గ్రహణాన్ని పూర్తిగా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. వ్యాఖ్యానం స్పానిష్ భాషలో ఉంటుంది. నాసా ( NASA )అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుంచి మొత్తం సూర్యగ్రహణాన్ని వీక్షించవచ్చు. Also read: America: ట్రంప్ పిటీషన్ కొట్టివేత, సుప్రీంకోర్టులో ట్రంప్‌కు చుక్కెదురు