Delhi Chalo farmers protest: న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నారు. గురువారంతో ఈ ఆందోళన ఎనిమిదో రోజుకు చేరింది. ఈ క్రమంలో మంగళవారం కేంద్ర ప్రభుత్వం.. రైతు సంఘాల ప్రతినిధులతో (Farmers Organizations).. జరిపిన చర్చలు విఫలం అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు తాజాగా మరోసారి కేంద్రానికి, రైతులకు మధ్య చర్చలు జరగనున్నాయి. ఈ చర్చల్లో కేంద్రం తరఫున వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ (Narendra Singh Tomar), 35 రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొననున్నారు.
Delhi: Farmers stay put at Nirankari Samagam Ground in Burari, the government designated place for the protest.
Delegation of farmers will meet Union Agriculture Minister Narendra Singh Tomar today. pic.twitter.com/xkzNdozcRC
— ANI (@ANI) December 3, 2020
ఈ క్రమంలో ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బుధవారం రైతులను ఢిల్లీవైపు రాకుండా నిలువరించేందుకు పోలీసులు జల ఫిరంగులను సైతం ఉపయోగించారు. ఈ మేరకు రాత్రి రైతు సంఘాల నాయకులు మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం వెంటనే వ్యవసాయ చట్టాలను ( Agriculture Bills ) రద్దు చేయాలని, ఈ మేరకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. చట్టాలు రద్దు చేయకుంటే ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. తమ డిమాండ్లు పరిష్కరించకుంటే.. దేశ రాజధానిలోని మిగిలిన రోడ్లనూ కూడా దిగ్బంధిస్తామని స్పష్టంచేశారు. రైతు సంఘాల మధ్య కేంద్రం చిచ్చు పెట్టాలని చూస్తోందని.. తామంతా ఐక్యంగానే ఉన్నామంటూ ప్రకటించారు. Also read: Kamal Haasan: రైతుల డిమాండ్లను ప్రభుత్వం వినాలి
దేశంలోని పలు రైతు సంఘాలు పిలుపునిచ్చిన ఢిల్లీ ఛలో ( Delhi Chalo ) నిరసన గురువారంతో ఎనిమిదో రోజుకు చేరుకుంది. ఢిల్లీ సరిహద్దుల్లోని పలు ప్రాంతాల్లో భారీ ఎత్తున బలగాలను మోహరించినప్పటికీ.. చలి తీవ్రత పెరిగినప్పటికీ రైతులు ఏమాత్రం వెనకడుగు వేయకుండా పలు ప్రాంతాల్లో తమ నిరసన తెలుపుతున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లోనే పలు రోడ్లను దిగ్భంధం చేసి రైతులు నిరసన తెలుపుతున్నారు. తాజాగా కేంద్రంతో చర్చల నేపథ్యంలో ఢిల్లీ సరిహద్దుల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే ఈ సమావేశం 10-11గంటల ప్రాంతంలో జరుగుతుందని సమాచారం.
Also read: Farmer protests: కొలిక్కిరాని చర్చలు.. రేపు మరోసారి కేంద్రంతో భేటీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe