GHMC Elections: హైదరాబాద్ నగరాన్ని కాంగ్రెస్ పార్టీనే అభివృద్ధి చేసింది- ఉత్తమ్

 Greater Elections | గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. వివిధ పార్టీల నేతలు కీలకమైన వ్యాఖ్యాలు చేస్తున్నారు. అందులో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నేత, తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెరాస, భాజపా, ఎంఐఎంపై మండిపడ్డారు. 

Last Updated : Nov 23, 2020, 12:59 PM IST
    1. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది.
    2. వివిధ పార్టీల నేతలు కీలకమైన వ్యాఖ్యాలు చేస్తున్నారు.
    3. అందులో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నేత, తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెరాస, భాజపా, ఎంఐఎంపై మండిపడ్డారు.
GHMC Elections: హైదరాబాద్ నగరాన్ని కాంగ్రెస్ పార్టీనే అభివృద్ధి చేసింది- ఉత్తమ్

Greater Elections | గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. వివిధ పార్టీల నేతలు కీలకమైన వ్యాఖ్యాలు చేస్తున్నారు. అందులో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నేత, తెలంగాణ  కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెరాస, భాజపా, ఎంఐఎంపై మండిపడ్డారు. సోమవారం రోజు గాంధీభవన్ లో ఒక మీడియా సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యాలు చేశారు.

Also Read WhatsApp Mute: ఇక వాట్సాప్ లో వీడియో పంపించే ముందు మ్యూట్ చేయవచ్చు 

హైదరాబాద్ నగరాన్ని ( Hyderabad) కాంగ్రెస్ పార్టీనే అభివృద్ధి చేసింది అని అన్నారు. దీనికి మెట్రో రైలు, పీవీ ఎక్స్ ప్రెస్ వే ఇలా ఎన్నో తమ పార్టీ తరపున చేశాం అని తెలిపారు. 

మరోవైపు తెలంగాణ (Telangana) ప్రజలు కరోనావైరస్ వల్ల నానాకష్టాలు పడుతోంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కెసీఆర్ ( KCR) దాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చలేదు అని విమర్శించారు. అదే సమయంలో వరదల వల్ల ప్రజలు అల్లాడిపోతోంటే కనీసం వారిని పరామర్శించలేదని వ్యాఖ్యాలు చేశారు.

Also Read |  Tip To Get Rich: వాస్తుశాస్త్రంలోని ఈ చిట్కాలు పాటిస్తే మీరు ధనవంతులు అవుతారు

అదే సమయంలో భారతీయ జనతా పార్టీని ( BJP) కూడా విమర్శించారు ఉత్తమ్. భాజపా అన్ని విషయాల్లో తెరాసకు సహకరిస్తోంది అని.. వారితో ఎంఐఎం (AIMIM) జతకట్టింది అని విమర్శించారు. దేశ వ్యాప్తంగా బీజేపీకి ఎంఐఎం మద్దతు ఇస్తోంది అని ఈ విషయం స్పష్టం అవుతోంది అని తెలిపారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News