Minister Anil Vij being administered a trial dose of Covaxin: న్యూఢిల్లీ: హైదరాబాద్ ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ (Bharat Biotech) అభివృద్ధి చేస్తున్న కొవిడ్-19 వ్యాక్సిన్ ‘కోవ్యాక్సిన్’ తుది దశ క్లినికల్ ట్రయల్స్ ( ‘Covaxin’ 3rd Phase trials ) దేశ్యావ్యాప్తంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ కోవ్యాక్సిన్ ట్రయల్ డోసును హర్యానా హోంమంత్రి, ఆరోగ్యమంత్రి అనిల్ విజ్ ( Haryana Health Minister Anil Vij ) శుక్రవారం తీసుకున్నారు. అంబాలాలోని కోవిడ్ ఆసుపత్రిలో ఆయన ఈ రోజు కోవిడ్ టీకాను వేయించుకున్నారు. అయితే రాష్ట్రంలో ప్రారంభమయ్యే కోవ్యాక్సిన్ ట్రయల్స్‌లో మొదటి వాలంటీర్‌గా ఆయన టీకాను తీసుకున్నారు. ఈ కోవ్యాక్సిన్ మూడో దశ ప్రయోగాలకు.. తొలి వాలంటీర్‌గా తాను స్వచ్ఛందంగా ముందుకొచ్చినట్లు మంత్రి అనిల్ విజ్ బుధవారం ట్విట్టర్‌లో ప్రకటించిన విషయం తెలిసిందే. Also read: Covaxin: కోవ్యాక్సిన్ వాలంటీర్‌గా హర్యానా మంత్రి అనిల్ విజ్
#WATCH Haryana Health Minister Anil Vij being administered a trial dose of #Covaxin, at a hospital in Ambala.
He had offered to be the first volunteer for the third phase trial of Covaxin, which started in the state today. pic.twitter.com/xKuXWLeFAB
— ANI (@ANI) November 20, 2020
అయితే.. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) సహకారంతో భారత్ బయోటెక్ సంస్థ కోవాక్సిన్ (Covaxin)ను అభివృద్ధి చేస్తోంది. అయితే మొదటి, రెండో దశ ట్రయల్స్‌లో ఈ వ్యాక్సిన్ ద్వారా ఉత్తమ ఫలితాలు రావడంతో.. డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా (DGCI) అనుమతితో ఈ నెల 16 నుంచి కోవ్యాక్సిన్ మూడోదశ ప్రయోగాలు దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. అయితే ఈ కోవాక్సిన్ ట్రయల్స్‌ను దేశవ్యాప్తంగా 25 కేంద్రాల్లో.. 26వేల మంది వాలంటీర్లపై నిర్వహించనున్నారు. దేశంలో ఇంత పెద్ద మొత్తంలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడం ఇదే మొదటిసారి. అయితే ఈ కోవ్యాక్సిన్ వచ్చే ఏడాది ప్రారంభం నాటికి అందుబాటులోకి రానుంది. Also read: Good News: ఫిబ్రవరి నాటికి కరోనా వ్యాక్సిన్: సీరం సీఈవో పూనావాలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.
మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి