Bigg Boss Telugu 4: కంటెస్టెంట్ హారికకు వెరీ స్పెషల్ మూమెంట్..

Kamal Haasan Saved Harika in Bigg Boss Telugu 4 | బిగ్‌బాస్ తెలుగు 4 (Bigg Boss Telugu 4) శనివారం రాత్రి ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా మారింది. కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా తెలుగు బిగ్‌బాస్ 4 హోస్ట్ నాగార్జునతో పాటు కంటెస్టెంట్స్ దిగ్గజ నటుడికి వర్చువల్‌గా శుభాకాంక్షలు తెలిపారు. హారిక సేవ్ అయినట్లు తమిళ బిగ్‌బాస్ 4 హోస్ట్ కమల్ హాసన్ ప్రకటించారు.

Last Updated : Nov 8, 2020, 11:46 AM IST
Bigg Boss Telugu 4: కంటెస్టెంట్ హారికకు వెరీ స్పెషల్ మూమెంట్..

బిగ్‌బాస్ తెలుగు 4 (Bigg Boss Telugu 4) శనివారం రాత్రి ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా మారింది. సాధారణంగా శని, ఆదివారాల్లో బిగ్ బాస్ తెలుగు 4 హోస్ట్ నాగార్జున వస్తారు కనుక హౌస్ సందడిగా మారుతుంది. అయితే నిన్న ఎసిసోడ్‌లో లోకనాయకుడు, సీనియర్ నటుడు కమల్ హాసన్ కనిపించారు. తమిళ బిగ్ బాస్ 4 హోస్ట్‌గా కమల్ హాసన్ (Bigg Boss Tamil 4 Host Kamal Haasan) వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా తెలుగు బిగ్‌బాస్ 4 హోస్ట్ నాగార్జునతో పాటు కంటెస్టెంట్స్ దిగ్గజ నటుడికి వర్చువల్‌గా శుభాకాంక్షలు తెలిపారు.

 

రెగ్యూలర్‌గా అయితే తోటి కంటెస్టెంట్ ఏదో రూపంలో మరో కంటెస్టెంట్ పేరు మీద వచ్చే చీటి తీసి పేరు చదవడమో లేక బిగ్ బాస్ పంపే బెలూన్లు పగలగొట్టడమో, ఏదైనా చిన్న ప్రయత్నం వల్ల సేవ్ అయ్యే కంటెస్టెంట్ పేరు ప్రకటిస్తారు. అయితే నిన్న ఎపిసోడ్‌లో తెలుగు బిగ్ బాస్ 4 హోస్ట్ నాగార్జున ఈ అవకాశాన్ని గౌరవ పూర్వకంగా తమిళ బిగ్ బాస్ 4 హోస్ట్ కమల్ హాసన్‌కు ఇచ్చారు. నాగార్జున కార్డు చూపించి అందులో ఉన్న కంటెస్టెంట్ సేవ్ అవుతార్ సార్ అంటూ కమల్ హాసన్‌కు చెప్పారు.

 

తాను కౌంట్ డౌన్ పూర్తిచేస్తున్న సమయలో పేరు కంటెస్టెంట్స్‌కు, వీక్షకులకు తెలిసేలా చెప్పాలని సూచించారు. నాగార్జున చూపించిన కార్డులో హారిక (Harika Saved) పేరు ఉంది. కౌంట్ డౌన్ పూర్తి కాగానే హారిక సేవ్ అయిందని కమల్ ప్రకటించారు. దీంతో హారిక థ్యాంక్యూ సార్.. హ్యాపీ బర్త్ డే వన్స్ అగైన్ అంటూ సంబరపడిపోయింది. కమల్ హాసన్ లాంటి దిగ్గజ నటుడి తన పేరు ప్రకటించి సేవ్ చేయడం.. ఇది తన జీవితంలో మరిచిపోలేని సంఘటన అని హారిక ఫుల్ హ్యాపీగా ఉంది.   Also Read : Bigg Boss Telugu 4 Contestants Remuneration: బిగ్ బాస్ 4 కంటెస్టెంట్స్ టాప్ 10 రెమ్యునరేషన్ వివరాలు వైరల్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Trending News