చండీగఢ్: కల్తీ పదార్థాలు, మత్తు పదార్థాలు అనారోగ్యానికి హానికరమని చెప్పినా మందుబాబులు వినిపించుకోవడం లేదు. అది ప్రాణాలకు ముప్పు తెస్తుంది. ఈ క్రమంలో హర్యానాలో విషాదం చోటుచేసుకుంది. కల్తీ మద్యం సేవించడంతో దాదాపు 20 మందికి పైగా మృత్యువాత పడ్డారు. హర్యానాలోని సోనిపట్‌లో ఈ ఘటన తాజాగా చోటుచేసుకుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కల్తీ మద్యం సేవించి 20 మందికి పైగా మృత్యువాత పడిన ఘటనపై సోనిపట్ ఏఎస్పీ వీరేంద్ర సింగ్ స్పందించారు. ‘ఈ విషయం మా దృష్టికి వచ్చింది. కానీ ఇప్పటివరకూ ఎలాంటి ఫిర్యాదు మాకు అందలేదు. నలుగురి మృతదేహాల శాంపిల్స్ తీసి టెస్టులకు పంపించాం. ఈ కేసులో దోషులు లేక ఇందుకు బాధ్యులు ఎవరైనా వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు తాము సిద్ధమని’ జాతీయ మీడియా ఏఎన్ఐతో మాట్లాడుతూ తెలిపారు. ఇలాంటి ఘటనలు జరిగితే తమకు ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు.
అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే జీ హిందుస్థాన్ యాప్ (Zee Hindustan App) డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe