కరోనా వైరస్ ( Corona virus ) కారణంగా మూతపడిన స్కూల్స్, కాలేజీలు నవంబర్ 2 నుంచి ( Schools and colleges reopen from november 2 ) ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) లో ఎట్టకేలకు పాఠశాలలు, కళాశాలలు తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. తొలుత సెప్టెంబర్ అని..తరువాత అక్టోబర్ నెలలో ప్రారంభిద్దామని అనుకున్నా..వైరస్ సంక్రమణ దృష్ట్యా సాధ్యం కాలేదు. ఇప్పుడు నవంబర్ 2 నుంచి ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్ ప్రభుత్వం ( Ap Government ) విడుదల చేసింది.
పాఠశాలలు, కాలేజీలు ఇకపై రోజు విడిచి రోజు నడపనున్నారు. అది కూడా ఒక పూట మాత్రమే. ప్రభుత్వం విడుదల చేసిన ఈ షెడ్యూల్ ప్రభుత్వ, ప్రైవేటు రెండింటికీ వర్తిస్తుంది. కోవిడ్ వ్యాపించకుండా అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ( Ap chief secretary neelam sahni ) ఈ కొత్త షెడ్యూల్ విడుదల చేశారు.
నవంబర్ 2 నుంచి 9,10,11 తరగతులతో పాటు ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సరం తరగతుల్ని తరగతులు రోజు విడిచి రోజు..ఒక పూట నడపనున్నారు. రొటేషన్ పద్ధతిలో ఈ తరగతులు జరగనున్నాయి. నవంబర్ 23 నుంచి 6,7,8 క్లాసులకు టీచింగ్ ప్రారంభం కానుంది. డిసెంబర్ 14 నుంచి 1, 2, 3, 4, 5 తరగతులను కూడా ప్రారంభిస్తారు. ఇంటర్మీడియట్, డిగ్రీ అడ్మిషన్లను ఇప్పటికే ప్రభుత్వం ఆన్ లైన్ ద్వారా ప్రారంభించింది. ఆన్ లైన్ అడ్మిషన్ల ప్రక్రియ ద్వారా కళాశాలల్లో జరిగే అక్రమాలకు చెక్ పెట్టేందుకు వీలవుతుందనేది ప్రభుత్వ ఆలోచన. Also read: SVBC Chairman Sai Krishna Yachendra: ఎస్వీబీసీ ఛానల్ ఛైర్మన్గా సాయికృష్ణ యాచేంద్ర.. ఉత్తర్వులు జారీ