Komatireddy Venkat Reddy Tests positive for CoronaVirus | తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. ముఖ్యంగా అన్ని రంగాల సెలబ్రిటీలు, ప్రముఖ వ్యక్తులు కరోనా వైరస్ బారిన పడి ఇబ్బంది పడుతున్నారు. ఎన్నికల ప్రచారం రావడంతో ప్రస్తుతం రాజకీయ నేతలు కోవిడ్19 బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం జహీరాబాద్ టీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్‌కు కరోనా పాజిటివ్‌గా తేలిన కొంత సమయానికే మరో ఎంపీకి కరోనా సోకింది. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Komatireddy Venkat Reddy) కరోనా బారిన పడ్డారు.
ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోవిడ్19 నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. అయితే ఆయనకు కరోనా లక్షణాలు లేవు. కరోనా పాజిటివ్ రావడంతో ఎంపీ కోమటిరెడ్డి సెల్ఫ్ ఐసోలేషన్లోకి వెళ్లారు. గత వారం రోజులుగా తనను కలిసి కాంగ్రెస్ నేతలు, ఇతరులు కోవిడ్19 టెస్టులు చేయించుకోవాలని సూచించారు. హోం క్వారంటైన్లో ఉండాలని సూచించినట్లు సమాచారం. దుబ్బాక ఉప ఎన్నికలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి తరఫున కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు కరోనా సోకింది.
కాగా, గడిచిన 24 గంటల్లో బుధవారం (అక్టోబరు 21 రాత్రి 8 గంటల వరకు) తెలంగాణలో కొత్తగా 1,456 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా ఐదుగురు మరణించారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల ( positive cases) సంఖ్య 2,27,580 కి చేరగా.. మరణాల సంఖ్య 1,292 కి పెరిగింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe