India invites Australia: చైనాకు మరో భారీ షాక్.. ఆస్ట్రేలియాకు భారత్ ఆహ్వానం

India invites Australia to Malabar naval drill: న్యూ ఢిల్లీ: భారత నావికాదళం నిర్వహించబోయే మలాబార్ నేవి డ్రిల్ ఎక్సర్‌సైజ్‌లో పాల్గొనడానికి ఆస్ట్రేలియాను భారత్ అధికారికంగా ఆహ్వానించింది. ఇప్పటివరకు భారత్, అమెరికా, జపాన్ సభ్యదేశాలుగా ఉన్న నేవి డ్రిల్ క్లబ్‌లో ( Malabar naval drill ).. తాజాగా ఆస్ట్రేలియా కలయికతో ‘క్వాడ్’ లేదా చతుర్భుజ సంకీర్ణంగా మారింది. ఐతే సరిగ్గా ఇదే పరిణామం ఆసియాలో ఒంటరి అవుతున్న చైనాను తీవ్ర కలవరపాటుకు గురిచేస్తోంది.

Last Updated : Oct 19, 2020, 09:54 PM IST
India invites Australia: చైనాకు మరో భారీ షాక్.. ఆస్ట్రేలియాకు భారత్ ఆహ్వానం

India invites Australia to Malabar naval drill: న్యూ ఢిల్లీ: భారత నావికాదళం నిర్వహించబోయే మలాబార్ నేవి డ్రిల్ ఎక్సర్‌సైజ్‌లో పాల్గొనడానికి ఆస్ట్రేలియాను భారత్ అధికారికంగా ఆహ్వానించింది. ఇప్పటివరకు భారత్, అమెరికా, జపాన్ సభ్యదేశాలుగా ఉన్న నేవి డ్రిల్ క్లబ్ ( Malabar naval drill ).. తాజాగా ఆస్ట్రేలియా కలయికతో ‘క్వాడ్’ లేదా చతుర్భుజ సంకీర్ణంగా మారింది. జపాన్, అమెరికా ( Japan and USA ) ప్రతీ సంవత్సరం జరిగే మలాబార్ నేవి డ్రిల్ ఎక్సర్‌సైజ్‌లో పాల్గొంటున్నాయి. వచ్చే నెలలో బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో ఈ మలాబార్ నేవి డ్రిల్ ఎక్సర్‌సైజ్ జరగనుంది.

"ఇటీవల రక్షణ రంగంలో ఆస్ట్రేలియా, భారత్ పరస్పరం సహకారం అందుకుంటున్న నేపథ్యంలో ఆస్ట్రేలియాను సైతం ఈ డ్రిల్‌లో భాగస్వామ్యం చేయడం ద్వారా ఆసియాలో మిత్ర దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపర్చుకోవచ్చని భారత్ భావిస్తోంది. ఐతే సరిగ్గా ఇదే పరిణామం ఆసియాలో ఒంటరి అవుతున్న చైనాను ( China worried about India's invite to Australia ) కలవరపాటుకు గురిచేస్తోంది. Also read : China on coronavirus: కరోనావైరస్ పుట్టింది చైనాలో కాదు: చైనా

లడఖ్ వివాదం ( Ladakh face-off ) అనంతరం భారత్‌తో చైనా సంబంధాలు దెబ్బతింటున్న ప్రస్తుత తరుణంలో అమెరికా-భారత్-జపాన్ దేశాలకు చెందిన నేవీ దళాల మధ్య సమన్వయం పెరిగేలా, సముద్రంపై పట్టు సాధించేలా జరగనున్న ఈ నేవి డ్రిల్ చైనాను ( China ) ఆందోళనకు గురిచేయడం ఖాయం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

గత కొన్నేళ్లుగా ఈ నేవి డ్రీల్‌లో భాగస్వామ్యం అవడానికి ఆస్ట్రేలియా చాలా ఆసక్తి కనబరుస్తోంది. మరోవైపు జపాన్, అమెరికా సైతం ఆస్ట్రేలియాను ఆహ్వానించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ వస్తున్నాయి. తాజాగా భారత్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఆ సమయం రానే వచ్చింది. కరోనావైరస్ ( Coronavirus ) వ్యాప్తి నివారణ దృష్ట్యా అంతర్జాతీయ నిబంధలనకు అనుగుణంగా ‘నో-కాంటాక్ట్’ పద్ధతిలో ఈ నేవి డ్రిల్ జరగనుంది. Also read : COVID-19 test result: 30 సెకన్లలో కరోనా ఫలితం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News