ప్రముఖ శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం 89వ జయంతి (APJ Abdul Kalam Jayanthi) నేడు (అక్టోబర్ 15న). దేశ వ్యాప్తంగా పలు రంగాలకు చెందిన ప్రముఖులు మహోన్నత వ్యక్తి అబ్దుల్ కలాంకు ఘనంగా నివాళి అర్పిస్తున్నారు. అబ్దుల్ కలాం 89వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) మిస్సైల్ మ్యాన్ అబ్దుల్ కలాం (YS Jagan pays tribute to APJ Abdul Kalam) సేవల్ని గుర్తు చేసుకున్నారు.
‘భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జీవిత చరిత్ర ఎప్పటికీ నిలిచిపోతుంది. లక్ష్యాలను సాధించాలనుకున్న కోట్లాదిమందికి ఆయన జీవితం స్ఫూర్తిదాయకం. మిలియన్ల మందిని ప్రోత్సహించిన వ్యక్తి కలాం. ‘మిస్సైల్ మ్యాన్’గా, ప్రజల రాష్ట్రపతిగా గుర్తింపు తెచ్చుకున్న అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకుని ఆయనకు నివాళులర్పిస్తున్నాను’ అని ఏపీ సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
Bharat Ratna Dr. APJ Abdul Kalam's story of persistence, ability, and sheer courage is a guiding light to millions who dare to dream and work towards its fulfillment. My humble tributes to the 'People's President', the legendary Missile Man on his birth anniversary.
— YS Jagan Mohan Reddy (@ysjagan) October 15, 2020
టీడీపీ అధినేత చంద్రబాబు ఘన నివాళి
దివంగత రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జయంతి (Abdul Kalam birth anniversary) సందర్భంగా ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఘన నివాళి అర్పించారు. ‘అబ్దుల్ కలాం అంటే ఒక స్ఫూర్తి శిఖరం. పరిణతి సాధించిన అరుదైన వ్యక్తిత్వం ఆయన సొంతం. దేశ అణు, శాస్త్రీయ రంగాలకు సరికొత్త మార్గనిర్దేశనం చేసిన దార్శనికుడు, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంగారి జయంతి సందర్భంగా ఆ మానవతావాది దేశ, సమాజ సేవలను స్మరించుకుందాం’ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు.
అబ్దుల్ కలాం అంటే ఒక స్ఫూర్తి శిఖరం. పరిణతి సాధించిన అరుదైన వ్యక్తిత్వం ఆయన సొంతం. దేశ అణు, శాస్త్రీయ రంగాలకు సరికొత్త మార్గనిర్దేశనం చేసిన దార్శనికుడు, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంగారి జయంతి సందర్భంగా ఆ మానవతావాది దేశ, సమాజ సేవలను స్మరించుకుందాం pic.twitter.com/TVKmkJ00uq
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) October 15, 2020
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe