కరోనా వ్యాప్తి కారణంగా విద్యారంగం సైతం కొంతకాలం పనులు ఆలస్యమయ్యాయి. ప్రస్తుతం విద్యాసంస్థలు తెరుచుకున్నాయి. ఆన్‌లైన్ క్లాసులు సైతం కొనసాగుతున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్ష తేదీలు ఖరారు చేశారు. అక్టోబర్ 9న మాస్టర్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ (ఎంఎంఎస్) పరీక్ష ప్రారంభం కానుంది.
ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) పరిధిలో అక్టోబర్ 12 నుంచి సంస్కృతంలో సీనియర్ డిప్లొమా, పోస్ట్ ఎమ్మెస్సీ డిప్లొమా ఇన్ రేడియోలాజికల్ ఫిజిక్స్, పీజీ డిప్లొమా ఇన్ ఫంక్షనల్ హిందీ అండ్ ట్రాన్స్‌లేషన్, పీజీ డిప్లొమా ఇన్ సైకలాజికల్ కౌన్సెలింగ్, పీజీ డిప్లొమా ఇన్ మ్యూజియాలజీ, పీజీ డిప్లొమ ఇన్ చైల్డ్ సైకాలజీ అండ్ ఫ్యామిలీ రిలేషన్స్, తదితర సబ్జెక్టు పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరగనున్నాయి.
పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ (ఎంబీఏ) పరీక్షలు అక్టోబర్ 13 నుంచి, ఎంబీఏ పరీక్షలు అక్టోబర్ 16 నుంచి ప్రారంభం కానున్నాయి. వీటితో పాటు పీజీ డిప్లొమా ఇన్ ట్రాన్స్‌లేషన్ (అరబిక్, ఇంగ్లీష్), పీజీ డిప్లొమా ఇన్ జాగ్రఫికల్ కార్టోగ్రఫీతో పాటు మోడ్రన్ అరబిక్‌కు సంబంధించి సీనియర్, జూనియర్ డిప్లొమా పరీక్షలకు వర్సీటీ షెడ్యూల్ ఖరారు చేసింది. పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్ లో చూసుకోవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
OU Exams: 9 నుంచి ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో పరీక్షలు
ప్రస్తుతం విద్యాసంస్థలు తెరుచుకున్నాయి. ఆన్‌లైన్ క్లాసులు సైతం కొనసాగుతున్నాయి.
అక్టోబర్ 9న మాస్టర్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ (ఎంఎంఎస్) పరీక్ష ప్రారంభం కానుంది.
పరీక్షల పూర్తి వివరాల కోసం ఉస్మానియా యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో