ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan )..తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ( Tirumala Srivari Brahmotsavam ) హాజరయ్యారు. పంచెకట్టు, నుదుట తిరునామం..మంగళవాయిద్యాలు, వేద మంత్రోఛ్ఛారణల మధ్య శ్రీవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు.
కరోనా వైరస్ ( Corona virus ) సంక్రమణ నేపధ్యంలో భక్తజనం లేకుండా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారికంగా హాజరయ్యారు. పంచెకట్టు ధరించి...నుదుట తిరునామంతో మంగళ వాయిద్యాలు, వేద మంత్రోఛ్చారణల నడుమ ఊరేగింపుగా శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు జగన్. ఆ తరువాత శ్రీవారి గరుడ వాహన సేవలో పాల్గొన్నారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం క్యాలెండర్, డైరీని సీఎం జగన్ ఆవిష్కరించారు.
శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పద్మావతి అతిధి గృహంలో రాత్రికి బస చేస్తారు. రేపు ఉదయం కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప ( Karnataka cm yeddyurappa ) తో కలిసి మరోసారి శ్రీవారిని దర్శించుకుంటారు. కర్ణాటక రాష్ట్ర ఛారిటీస్ సత్రాల శంకుస్థాపన కార్యక్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో కలిసి పాల్గొంటారు.
రెండ్రోజుల ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ( Amit shah ) , కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ( Gajendra singh shekhawat ) లను కలిసిన సీఎం జగన్..ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కేంద్రం నుంచి అందాల్సిన సాయంపై చర్చించారు. ఆ తరువాత ఏపీ భవన్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ( ysr congress party ) ఎంపీలతో ముఖ్యమంత్రి జగన్ సమావేశమయ్యారు. Also read: AP: ప్రదాని నరేంద్రమోదీ టార్గెట్ గా మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలు
Tirumala: పంచెకట్టు, నుదుట తిరునామంతో శ్రీవారికి పట్టు వస్త్రాలు