Fire Accident: పెట్రోల్ బంక్‌లో బైకు దగ్ధం.. తృటిలో తప్పిన ప్రమాదం

పెట్రోల్ పోయించుకోవడానికి వచ్చిన ఓ వ్యక్తి బైకు మంటలు (Fire Accident at Petrol Bunk) రావడంతో దగ్దమైంది. నీళ్లు పోయడంతో మంటలు ఆరిపోయాయి. కానీ పెట్రోల్ బంకు యాజమాన్యం నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Last Updated : Aug 12, 2020, 03:53 PM IST
  • పెట్రోల్ బంక్‌లో తృటిలో తప్పిన పెద్ద ప్రమాదం
  • మంటలు అంటుకుని నిమిషాల్లో దగ్దమైన బైకు
  • మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఘటన
Fire Accident: పెట్రోల్ బంక్‌లో బైకు దగ్ధం.. తృటిలో తప్పిన ప్రమాదం

పెట్రోల్ బంక్‌ (Fire Accident at Petrol Bunk)లో తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. పెట్రోల్ పోయించుకోవడానికి వచ్చిన ఓ వ్యక్తి బైకు మంటలు రావడంతో దగ్దమైంది. ఈ షాకింగ్ ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని ఓ పెట్రోల్ బంక్‌లో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. నేటి ఉదయం ఓ వాహనదారుడు పెట్రోల్ పోయించుకోవడానికి భారత్ పెట్రోలియం బంకుకు వెళ్లాడు. CJI Bobde: కృష్ణుడు ఈరోజే జైలులో పుట్టాడు.. నీకు బెయిల్ కావాలా?

పెట్రోల్ పోయించుకుంటున్న క్రమంలో బైకు నుంచి అకస్మాత్తుగా మంటలు (Fire Accident) వచ్చాయి. అసలే పెట్రోల్ కావడంతో క్షణాల్లో మంటలు వ్యాపించి బైకు దగ్దమైంది. పెట్రోల్ బంకు సిబ్బంది మంటల్ని ఆర్పేందుకు ఫైర్ ఐటమ్‌ను వాడాలని చూసినా ప్రయోజనం లేకపోయింది. దాని వాడకం తెలియకనో, లేక సరైన భద్రతా ప్రమాణాలు పాటించనందుకో అది పనిచేయలేదు. Sara Ali Khan Birthday Special: సారా అలీ ఖాన్ బర్త్‌డే స్పెషల్ గ్యాలరీ

వాటర్ క్యాన్‌లతో పదే పదే నీళ్లను తీసుకొచ్చి బైకు మీద పోస్తూ మంటల్ని ఆర్పే యత్నం చేశారు. పెట్రోల్ బంకులో పెద్ద అగ్ని ప్రమాదం జరగనందుకు బంకు సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. కానీ మంటల్ని ఆర్పే మెషీన్ పనిచేయకపోవడంతో భద్రతా ప్రమాణాలు గాలికొదిలేశారంటూ భారత్ పెట్రోల్ బంకు యాజమాన్యంపై వాహనదారులు మండిపడుతున్నారు. పెళ్లికి ముందే గర్భం దాల్చిన నటీమణులు వీరే... 
RGV లెస్బియన్ నటి Naina Ganguly హాట్‌ ఫొటోలు

Trending News