సెరెనా బిడ్డ పేరులోని రహస్యమేమిటి?

Last Updated : Oct 3, 2017, 03:08 PM IST
సెరెనా బిడ్డ పేరులోని రహస్యమేమిటి?

ఎట్టకేలకు టెన్నిస్ తార సెరెనా విలియమ్స్ తన బిడ్డ పేరు వెనకున్న రహస్యాన్ని వెల్లడించారు. ఎలక్సిస్ ఒలింపియా ఒహానియన్ పేరుతో ఇప్పటికే సోషల్ మీడియాలో పాపులరైన చిన్నారికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని సెరెనా విలియమ్స్ ట్విటర్ ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు. తను ప్రెగ్నెంట్ అవ్వడానికి సరిగ్గా ఒక సంవత్సరం క్రితం సాధించిన ఆస్ట్రేలియా ఒపెన్‌ టైటిల్‌లోని పదాల తొలి రెండు అక్షరాలు కలిసి వచ్చేలా తన బిడ్డకు పేరు పెట్టుకున్నానని ఆమె తెలిపారు. ఆస్ట్రేలియాలోని "ఏ" అక్షరంతో ఎలక్సిస్ అనే పదాన్ని, "ఓ" అక్షరంతో "ఒలింపియా" అనే పదాన్ని కలిపి తన బిడ్డకు పేరు పెట్టామన్నారు. సెరెనా భర్త పేరు ఎలక్సిస్ ఒహానియన్. ఆయన పేరు కూడా కలిపుతూ తన చిన్నారికి ఆ పేరు పెట్టారు. సెరెనా భర్త ప్రముఖ సోషల్ వెబ్ సైట్ రెడ్డిట్ వ్యవస్థాపకులు. 2016లో వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. 

 

Trending News