Real Hero Sonu Sood: అరుంధతి, దూకుడు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నటుడు సోనూ సూద్ ( Sonu Sood ). నటుడిగా నెగెటీవ్ షేడ్స్ ఉన్న పాత్రలు ఎక్కువగా చేసినా.. నిజ జీవితంలో మాత్రం సోనూ సూద్ చాలా మంది జీవితంలో హీరో పాత్ర పోషించాడు. లాక్డౌన్ ( LockDown ) సందర్భంలో ఎంతో మంది సొంత గ్రామాలకు వెళ్లడానికి ఇబ్బంది పడుతోంటే వారికి బస్సులు ఏర్పాటు చేసి సొంత గూటికి పంపించాడు. ప్రతీ వలస కార్మికుడు తమ ఇంటికి చేరే వరకు ఆగేది లేదు అనే సంకల్పంతో రంగంలోకి దూకాడు ఈ రియల్ హీరో. ( శ్రీ రాపాకా స్వీటి ఘాటు అందాల హాటు ఫోటోలు )
— sonu sood (@SonuSood) June 23, 2020
వలస కార్మికుల విషయంలోనే కాదు.. సమస్యల్లో ఉన్న ఎవరైనా సహాయం అడిగితే.. కాదు.. లేదు అనకుండా వెంటనే చేసి పెట్టడం సోనూ సూద్ స్పెషాలిటీ...అలా సహాయం అడిగిన ఒక చిన్నారికి ఇక మీ ఇంటిపైకప్పు నుంచి ఇక నీరు కారదు అని చెప్పి చూపించాడు సోనూ సూద్.
Aaj ke baad apki chatt se kabhi paani nahin aayega. ❤️🤞 @NeetiGoel2 https://t.co/vzZWiaAi19
— sonu sood (@SonuSood) July 25, 2020
ఇటీవలే ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాకు చెందిన ఒక రైతు కుటుంబానికి సాయం చేసి మళ్లీ తన గొప్పతనం చాటుకున్నాడు సోనూసూద్.
This family doesn’t deserve a pair of ox 🐂..
They deserve a Tractor.
So sending you one.
By evening a tractor will be ploughing your fields 🙏
Stay blessed ❣️🇮🇳 @Karan_Gilhotra #sonalikatractors https://t.co/oWAbJIB1jD— sonu sood (@SonuSood) July 26, 2020
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu ) కూడా సోనూ సూద్ చేసిన మంచిపనిని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. తన వంతుగా రైతు కుటుంబానికి సహాయం చేస్తానన్నారు నారా చంద్రబాబు నాయుడు.
Thank you so much sir for all the encouraging words. Your kindness will inspire everyone to come forward and help the needy. Under your guidance millions will find a way to achieve their dreams. Keep inspiring sir. I look forward meeting you soon. 🙏🇮🇳 https://t.co/XruwFx1vy2
— sonu sood (@SonuSood) July 26, 2020
ఎవరు సాయం అడిగినా యస్ అని వెంటనే చేసి చూపించడం సోనూ సూద్ ప్రత్యేకత. ఇలా ఎంతో మంది జీవితాల్లో వెలుగు తీసుకొచ్చిన సోనూ సూద్... ముంబై లోని తన హోటల్ మొత్తం కరోనావైరస్ ( Coronavirus ) సోకిన పేషెంట్లకు ట్రీట్మెంట్ అందించే వైద్యులు, సిబ్బందికి కేటాయించాడు. వలస కార్మికులు తమ ఇంటికి వెళ్లేలా చేయడమే కాదు.. వారికి ఉపాధి కల్పించడమే తన లక్ష్యంగా పెట్టుకున్నాడు ఈ రియల్ హీరో ( #RealHeroSonuSood) . ప్రస్తుతం మరో మిషన్ ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు సోనూ సూద్.
New mission 😳
On it🤞 https://t.co/YYKOuztZqj
— sonu sood (@SonuSood) July 27, 2020
Mask During Workouts: వర్కవుట్ చేసే సమయంలో మాస్క్ వేసుకోవాలా వద్దా ?
Countries Without Covid-19: కరోనా వైరస్ నుంచి సురక్షితంగా ఉన్న దేశాలివే