కరోనాతో హైదరాబాద్‌లో జర్నలిస్ట్ మృతి.. పాజిటివ్‌గా తేలిన గంటల్లోనే!

ఓ యంగ్ జర్నలిస్ట్ కోవిడ్19 బారిన పడి కన్నుమూశారు. ఈ విషాదం హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. అయితే కోవిడ్19 పాజిటివ్‌గా తేలిన మరుసటిరోజు జర్నలిస్ట్ మనోజ్ కుమార్ చనిపోవడం విచారకరం.

Last Updated : Jun 7, 2020, 02:29 PM IST
కరోనాతో హైదరాబాద్‌లో జర్నలిస్ట్ మృతి.. పాజిటివ్‌గా తేలిన గంటల్లోనే!

కరోనా వారియర్స్‌లో డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికుల పాత్ర ఎంత ఉందో మీడియా పాత్ర సైతం అంతే కీలకమని తెలిసిందే. కరోనా జాగ్రత్తలు (CoronaVirus) వివరిస్తూ ప్రజల్ని చైతన్యం చేస్తూ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ముందుకు సాగుతున్నారు జర్నలిస్టులు. ఈ క్రమంలో ఓ యంగ్ జర్నలిస్ట్ కోవిడ్19 బారిన పడి కన్నుమూశారు. ఈ విషాదం హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.  టాప్5 కరోనా దేశాల్లో చేరిన భారత్

మనోజ్ కుమార్ టీవీ5 మీడియాలో రిపోర్ట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు కరోనా వైరస్ సోకింది. అయితే కోవిడ్19 (COVID-19) పాజిటివ్‌గా తేలిన మరుసటిరోజు జర్నలిస్ట్ మనోజ్ కుమార్ చనిపోవడం విచారకరం. ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మనోజ్ చనిపోయారని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు ధ్రువీకరించారు. కాగా, రిపోర్ట్ మనోజ్ కుమార్‌కు మయస్తీనియా గ్రేవిస్ అనే ఊపిరితిత్తుల సమస్య ఉందన్నారు.   అందాల నటి కల్పిక గణేష్ Photos

ఆయనకు గతేడాది వివాహం కాగా, మనోజ్ కుమార్ భార్య ప్రస్తుతం గర్భిణి అని తెలుస్తోంది. తోటి జర్నలిస్టులు అప్యాయంగా లడ్డు అని పిలుచుకునే మనోజ్ ఇక తమ మధ్య ఉండడన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మనోజ్ మృతి పట్ల జర్నలిస్టు సంఘాలు సంతాపం వ్యక్తం చేశాయి. తెలంగాణలో కరోనా మరణించిన తొలి (రిపోర్టర్) జర్నలిస్ట్ మనోజ్ కుమార్ అని తెలుస్తోంది.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
గ్లామర్ డాల్ సెక్సీ ఫొటోలు వైరల్
 

Trending News