కరోనా వైరస్ ప్రభావాన్ని అధికంగా ఎదుర్కొంటున్న దేశాల జాబితాలో భారత్ సైతం చేరిపోయింది. నిత్యం భారీ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలలతో దేశ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా ఒక్క రోజులులో భారత్లో 7,466 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, 175 మంది కరోనా బారిన పడి మరణించారు. దేశంలో ఇప్పటివరకూ 4,706 కరోనా మరణాలు సంభవించాయి. Photos: తెలంగాణలో మహత్తర ఘట్టం
గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 7,466 కరోనా కేసులు నమోదు కాగా, దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,65,799కి చేరింది. చికిత్స అనంతరం 71,105 మంది కరోనా బారి నుంచి కోలుకుని పూర్తి ఆరోగ్యంతో డిశ్ఛార్జ్ అయి ఇంటికి వెళ్లిపోగా, ప్రస్తుతం 89,987 యాక్టీవ్ కేసులున్నాయి. బికినీలో బ్యూటీలు.. సమ్మర్ మరింత హాట్!
కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ ఈ వివరాలు వెల్లడించింది. ఈ మేరకు తాజాగా హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. భౌతిక దూరం పాటించడం, చేతుల్ని శుభ్రంగా కడుక్కోవడం లాంటివి చేయాలని ప్రజలకు సూచించింది. దగ్గు, జ్వరం, జలుబు, తలనొప్పి, గొంతునొప్పి లాంటి లక్షణాలు కనిపిస్తే దగ్గర్లోని వైద్యులను సంప్రదించాలని ప్రజలను కోరారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
బికినీ అందాలతో రెచ్చిపోయిన నటి