'కరోనా వైరస్' కారణంగా లాక్ డౌన్ విధించడంతో జనం ఇళ్లకు పరిమితమయ్యారు. దీంతో జంతువులు అటవీ ప్రాంతాల నుంచి జనావాసాల్లోకి వస్తున్నాయి. మొన్నటికి మొన్న హైదరాబాద్లో నడి రోడ్డుపై చిరుత దర్శనమిచ్చింది.
ఇప్పుడు మరో చిరుత పులి ఏకంగా జనావాసాల్లోకే దూరింది. గుజరాత్లోని దహోడ్లో ఈ ఘటన జరిగింది. తెల్లవారుజామున చిరుతను చూసి జనం షాకయ్యారు. ఓ ఇంట్లోని కారు వద్దకు చేరింది చిరుత. దీంతో స్థానికంగా ఉన్న వారు భయాందోళనకు గురయ్యారు. పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు అటవీ శాఖ సిబ్బందికి సమాచారమిచ్చి ఘటనాస్థలానికి చేరుకున్నారు.
#WATCH Gujarat: A leopard entered a residential area in Dahod. The animal was rescued later. 4-5 members of the rescue team that included police personnel and forest officials received minor injuries while trying to nab the animal. (23.05.2020) pic.twitter.com/YRxagmsO8r
— ANI (@ANI) May 23, 2020
చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ వారి నుంచి పలుదఫాలుగా చిరుత తప్పించుకుంది. చిరుతను పట్టుకునే క్రమంలో ఐదుగురు అటవీ శాఖ సిబ్బంది, పోలీసులకు గాయాలయ్యాయి. ఐతే ఎట్టకేలకు వారు విజయవంతంగా చిరుతను బంధించారు. ఆ తర్వాత జూ కు తరలించారు.
చిరుతను అటవీ అధికారులు తీసుకుని వెళ్లడంతో జనం ఊపిరిపీల్చుకున్నారు. చిరుత అర్ధరాత్రే జనావాసాల్లోకి ప్రవేశించి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఐతే అందరూ నిద్రపోతూ ఇళ్లల్లోనే ఉండడంతో ప్రమాదం తప్పింది.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..